Rajinikanth173: క్రేజీ మూవీ నుంచి తప్పుకున్న డైరెక్టర్
సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) ఇప్పుడు వరుస సక్సెస్ లతో ఫుల్ జోష్ లో ఉన్నారు. జైలర్(jailer) తర్వాత నుంచి రజినీ చేస్తున్న సినిమాల స్టైల్ లో చాలా మార్పులొచ్చాయి. ఆ మార్పుల వల్లే రజినీ మంచి సక్సెస్ లను అందుకుంటున్నారు. రీసెంట్ గా కూలీ(Coolie) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రజినీకాంత్ ఆ సినిమాతో మంచి కలెక్షన్లనే అందుకున్నారు.
ప్రస్తుతం జైలర్2(jailer2) షూటింగ్ లో బిజీగా ఉన్న రజినీకాంత్ రీసెంట్ గా ఓ క్రేజీ కాంబినేషన్ ను సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. రజినీకాంత్ తన ఫ్రెండ్ కమల్ హాసన్(kamal hassan) నిర్మాతగా సుందర్ సి(sundar C) దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. రజినీకాంత్ కెరీర్ లో ఈ సినిమా 173వ మూవీగా తెరకెక్కనుందని మేకర్స్ ఈ మూవీని ఎంతో గ్రాండ్ గా అనౌన్స్ చేశారు.
అయితే రీసెంట్ గా ఈ ప్రాజెక్టు నుంచి డైరెక్టర్ సుందర్ తప్పుకోగా, దీనిపై నిర్మాత కమల్ ఓపెన్ అయి మాట్లాడారు. సుందర్ తీసుకున్న నిర్ణయం అందరికీ తెలిసిందేనని, మళ్లీ ఆ కొలాబరేషన్ జరగదని, నిర్మాతగా తన హీరోకి నచ్చే స్టోరీతోనే తాను ముందుకెళ్తానని, ఇప్పుడు ఆ పనుల్లోనే ఉన్నామని, మంచి కథ దొరికినప్పుడు కచ్ఛితంగా సినిమా మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు కమల్.






