అనుష్క వదులుకున్న ఆ ఆఫర్లేంటంటే..
స్వీటీ శెట్టి అలియాస్ అనుష్క శెట్టి సౌత్ అగ్ర కథానాయికగా దాదాపు 15 ఏళ్ల కెరీర్ ని సునాయాసంగా నడిపించేసిన సంగతి తెలిసిందే. సూపర్ చిత్రంతో టాలీవుడ్ అడుగుపెట్టిన ఈ భామ ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అటుపై కెరీర్ పరంగా వెనుదిరిగి చూసిందే లేదు. బాహుబలిలో దేవసేనగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అనుష్క కెరీర్ లో అరుంధతి, భాగమతి లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఉన్నాయి. హీరోలకు ధీటుగా జనాల్ని థియేటర్లకు రప్పించే సత్తా ఉన్న నటిగా అనుష్క ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు కూడా.
అరుంధతి2, పొన్నియన్ సెల్వన్, కొచ్చాడయాన్, నారప్ప చిత్రాల్లో నటించే అవకాశాన్ని అనుష్క వదులుకున్నారు. అటు హిందీలోనూ గోల్ మాల్, తమాషా, సింఘం లాంటి క్రేజీ ఆఫర్లు స్వీటీని వరించినా ఏ మాత్రం ఆసక్తిని కనబరచలేదు. సౌత్ లో తనకు ఉన్న సేఫ్ జోన్ నుంచి బయటపడి బాలీవుడ్ లో నటించేందుకు ఏ మాత్రం ఇష్టపడలేదు. తన 14 ఏళ్ల కెరీర్లో అనుష్క శెట్టికి చాలా పెద్ద అవకాశాలు వచ్చాయి. కానీ రకరకాల కారణాల వల్ల ఆమె కొన్నింటిని తిరస్కరించారు. దక్షిణ భారతదేశంలో అత్యంత భారీ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా అనుష్క నిలిచింది. గతంలో కరణ్ జోహార్ చిత్రంతో బాలీవుడ్ అరంగేట్రం కోసం సిద్ధమవుతుందని పుకార్లొచ్చాయి. దర్శకుడు, నిర్మాత ఒక చిత్రం కోసం అనుష్కను సంప్రదించినా, ఆ పాత్రపై పూర్తిగా సంతృప్తి చెందకపోవడంతో స్వీటీ నిరాకరించారని కథనాలొచ్చాయి.













