Tharun Bhasker: కామెడీ సీన్స్ రాయడం అంత ఈజీ కాదు

పెళ్లి చూపులు(Pelli Choopulu), ఈ నగరానికి ఏమైంది(ee nagaraniki emaindhi) సినిమాలతో కెరీర్ మొదట్లోనే సూపర్ హిట్లను అందుకున్నాడు టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్(Tharun Bhasker). తరుణ్ సినిమాలు ఎంతో వినోదాత్మకంగా ఉంటాయని ఆయనకు మంచి పేరు కూడా ఉంది. అలాంటి తరుణ్ నుంచి సినిమా వచ్చి చాలా కాలమవుతుంది. తరుణ్ భాస్కర్ నుంచి చివరిగా వచ్చిన సినిమా కీడా కోలా(keeda kola).
మంచి అంచనాలతో వచ్చిన కీడా కోలా ఆ అంచనాలను అందుకోలేక పోయింది. కీడా కోలా బ్లాక్ బస్టర్ అవకపోయినప్పటికీ ఆ సినిమాలోని కామెడీతో అందరినీ అలరించాడు తరుణ్. తన కామెడీతో అందరినీ అలరించి కామెడీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ కామెడీ రాయడం అనుకున్నంత ఈజీ కాదని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
కామెడీ సీన్స్ ను అందరూ చాలా చులకనగా తీసేస్తారని, కానీ వాటిని రాయడం వెనుక నిజమైన కష్టం ఉంటుందని, పెళ్లి చూపులు సినిమాకు కామెడీ సీన్స్ రాసేటప్పుడు తన తండ్రి హెల్త్ చాలా సీరియస్ గా ఉందని, రాత్రి టైమ్ లో చాలా టెన్షన్ పడుతూనే ఆ సీన్స్ రాశానని తరుణ్ భాస్కర్ రీసెంట్ గా బద్మాషులు(Badmashulu) ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్టుగా హాజరై చెప్పాడు. కామెడీ గురించి తరుణ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.