Thanikella Bharani: అప్పుడు మిస్ అయిన ఛాన్స్ ఇప్పుడు దక్కింది

లైఫ్ లో అనుకున్నవన్నీ జరగవు. సినీ ఇండస్ట్రీలో కూడా అంతే. ఏదో చేయాలనుకుని వస్తే ఏదో అవుతారు కొందరు. ఒకరు చేయాల్సిన సినిమాను మరొకరు చేసిన సందర్భాలు కొన్ని. అన్నీ అనుకున్న తర్వాత సినిమాలు ఆగిపోయిన సందర్భాలు మరికొన్ని. అలా 1991లో తనికెళ్ల భరణి(Thanikella Bharani) కి కూడా ఓ సిట్యుయేషన్ ఎదురైందట. రజినీకాంత్(Rajinikanth)- మణిరత్నం(Maniratnam) కాంబోలో ఆయనకు ఓ అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిందని వెల్లడించారు భరణి.
ఆ సినిమా కోసం లుక్ టెస్ట్, ఆడిషన్ అయ్యాక వయసు సరిపోదనే కారణంతో తనను రిజెక్ట్ చేశారని, అప్పట్నుంచి మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేయాలనే కోరిక అలానే ఉండిపోయిందని, మూడేళ్ల కిందట పొన్నియన్ సెల్వన్(Ponniyan Selvan) సినిమాకు స్క్రిప్ట్ వర్క్ చేసేటప్పుడు నెక్ట్స్ సినిమా ఓ చినన షాట్లో అయినా కనిపించే ఛాన్స్ ఇవ్వమని మణిరత్నంను అడిగానని, దానికి ఆయన నవ్వి ఊరుకున్నారని భరణి తెలిపారు.
తర్వాత థగ్ లైఫ్(Thug Life) లో ఛాన్స్ ఉందని పిలిచారని ఒక చిన్న షాట్ చాలనుకుని ఆయన్ను ఛాన్స్ అడిగితే థగ్ లైఫ్ లో ఎక్కువ నిడివి ఉన్న పాత్రతో పాటూ మంచి క్యారెక్టర్ ను కూడా ఇచ్చారని, దీంతో తన ఎన్నో ఏళ్లుగా కంటున్న కల తీరిపోయిందన్నట్టు భరణి తెలిపారు. మొత్తానికి అప్పుడు రజినీకాంత్ తో మిస్ అయిన ఛాన్స్ ఇప్పుడు కమల్(Kamal) ద్వారా అందుకున్నారన్నమాట. ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.