అప్పట్లో మణిశర్మ.. ఇప్పుడు తమన్
ఒక హీరోకి, మ్యూజిక్ డైరెక్టర్‌కి సరిగ్గా సింక్ కుదిరితే మంచి ఆల్బమ్స్ వస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా కూడా మంచి ఫలితం ఉంటుంది. దీంతో థియేటర్లకు రిపీట్ ఆడియన్స్ వచ్చే ఛాన్సుంటుంది. ఇక అసలు విషయానికొస్తే గత కొన్ని కాలంగా బాలయ్య(Balaiah) సినిమాలన్నింటికీ వరుసపెట్టి తమనే మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటున్నాడు.
ఇప్పటికే వీరి కాంబోలో అఖండ(akhanda), వీరసింహా రెడ్డి(Veera simha reddy), భగవంత్ కేసరి(Bhagavanth Kesari), ఎన్బీకే109(NBK109) వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ గా బోయపాటి(boyapati)- బాలయ్య(balakrishna) కాంబోలో తెరకెక్కనున్న అఖండ2 శివతాండవం(akhanda2 sivathandavam) కు కూడా తమనే(thaman) సంగీతం అందిస్తున్నాడు. అంటే వీరిద్దరూ కలిసి పనిచేయడం ఇది ఐదోసారి. ఇలా వరుసగా బాలయ్యకు గతంలో మణిశర్మ(mani sharma) మాత్రమే సంగీతం ఇచ్చాడు.
సమరసింహా రెడ్డి(samarasimha reddy), నరసింహ నాయుడు(narasimha naidu), చెన్నకేశవ రెడ్డి(chennakesava reddy), లక్ష్మీ నరసింహా(lakshmi narasimha) లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటూ భలేవాడివి బాసూ(bhale vadivi baasu), పల్నాటి బ్రహ్మనాయుడు(palnati brahma naidu), అల్లరి పిడుగు(allari pidugu), లయన్(lion), ఒక్క మగాడు(okka Magadu) లాంటి ఆడని సినిమాలకు సైతం మంచి సాంగ్స్ అందించాడు మణిశర్మ(mani sharma). గతంలో మణిశర్మలానే ఇప్పుడు తమన్ కూడా బాలయ్యతో మంచి బాండింగ్ ఏర్పరచుకోవడం వల్ల డైరెక్టర్లకు తమన్ ఓన్లీ ఆప్షన్ గా కనిపిస్తున్నాడు.
తమన్ బాలయ్యతోనే కాదు పవన్ కళ్యాణ్(pawan kalyan) తో కూడా వరుస సినిమాలు చేస్తూ మంచి అనుబంధం ఏర్పరచుకున్నాడు. వకీల్ సాబ్(vakeel saab), భీమ్లా నాయక్(Bheemla Nayak), బ్రో(BRO) కు తమన్ పనితనం చూసి ఓజీ(OG) సినిమాను కూడా తమన్ కే ఇప్పించాడు పవన్. మొత్తానికి ప్రస్తుతం తమన్ వరుస సినిమాలతో బాగానే బిజీగా ఉన్నాడు. అయితే అఖండ రిలీజ్ టైమ్ లో చాలా చోట్ల థియేటర్లలో సౌండ్ బాక్సులు డ్యామేజ్ అవగా, ఈసారి అఖండ2 కోసం థియేటర్ ఓనర్లు ముందు నుంచి జాగ్రత్త పడితే బెటరని బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు.













