వరుస అప్డేట్స్ ఇచ్చిన తమన్
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రస్తుతం పలు క్రేజీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కు అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు. తాజాగా ఎక్స్ లో చిట్ చాట్ నిర్వహించిన తమన్ తను వర్క్ చేస్తున్న పలు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను అందించాడు.
తమన్ సంగీతమందిస్తున్న సినిమాల్లో చరణ్- శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ ఒకటి. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజవగా, ఈ నెలాఖరు నుంచి గేమ్ ఛేంజర్ మ్యూజికల్ అప్డేట్స్ వస్తాయని తెలిపాడు తమన్. బాబీ- బాలయ్య కాంబోలో వస్తున్న సినిమా గురించి ఏమైనా చెప్పమని అడగ్గా, ఈ సినిమా ఫ్యాన్స్ ఫీస్ట్ లా ఉండబోతుందని చెప్పాడు.
అతి త్వరలో తాను హీరో అజిత్ తో వర్క్ చేస్తానని వెల్లడించాడు తమన్. ఇదిలా ఉంటే తమన్ మ్యూజిక్ అందిస్తున్న సినిమాల్లో ఓజి కూడా ఒకటి. ఈ సినిమా ప్రమోషనల్ స్టఫ్ ను డైరెక్టర్ సుజిత్ తో కలిసి రెడీ చేస్తున్నట్లు తమన్ చెప్పాడు. ప్రభాస్- మారుతి కాంబోలో వస్తున్న రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ వచ్చే జనవరిలో రిలీజ్ చేస్తామని చెప్పిన తమన్, మహేష్ బాబు చేసే ఛారిటీ కార్యక్రమాలంటే తనకు ఇష్టమని, ఆయనొక కేరింగ్ హ్యూమన్ అని, ఎన్టీఆర్ మోస్ట్ ఎంకరేంజింగ్ పర్సన్ అని పేర్కొన్నాడు. వారసుడు సినిమా తనకు చాలా దగ్గరైన ఆల్బమ్ అని, త్వరలోనే ఓజితో కలుస్తానని తమన్ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా తమన్ చిట్ చాట్ వల్ల చాలా పెద్ద సినిమాలకు సంబంధించిన మ్యూజిక్ అప్డేట్స్ బయటికొచ్చాయి.













