Test: నయన్ సినిమాపై ఆడియన్స్ అసంతృప్తి
రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో రిలీజైన టెస్ట్(test) సినిమా భారీ అంచనాలతో రిలీజైంది. మాధవన్(Madhavan), నయనతార(Nayanthara), సిద్ధార్థ్(Siddharth), మీరాజాస్మిన్(Meera Jasmin) ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమాకు మేకర్స్ పెద్దగా ప్రమోషన్స్ చేసింది లేదు. కానీ స్టార్ క్యాస్టింగ్ వల్ల సినిమా ఆడియన్స్ లోకి బాగానే వెళ్లింది. సినిమా రిలీజయ్యాక మౌత్ టాక్ తో అవసరం లేకుండానే టెస్ట్ కు ప్రమోషన్స్ జరుగుతాయని మేకర్స్ భావించారు.
కానీ ఆ సినిమాలో కథ, రైటింగ్ సరిగా లేకపోవడంతో టెస్ట్ సినిమా ఆడియన్స్ కు పెద్దగా నచ్చడం లేదు. దీంతో అనవసరంగా మంచి స్టార్ క్యాస్టింగ్ ను వేస్ట్ చేశారని నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాలో నటీనటులు ఎంత మంచి పెర్ఫార్మెన్స్ చేసినా సినిమాలో మ్యాటర్ లేనప్పుడు అది వృధానే అవుతుంది.
టెస్ట్ సినిమా చూసిన ఆడియన్స్ కొందరు అసలు సినిమా కథ సడెన్ గా ఎందుకు ఎండ్ అవుతుందని అంటుంటే, మరికొందరు సినిమాకు టెస్ట్ అని మంచి టైటిలే పెట్టారు ఆ టెస్ట్ ప్రేక్షకుల సహనానికి అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఒక మంచి కాన్సెప్ట్ ను, స్టార్ క్యాస్ట్ ను మేకర్స్ వేస్ట్ చేశారు.













