Telusu Kada: ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న తెలుసు కదా?
టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) మంచి టాలెంటెడ్ అనే సంగతి తెలిసిందే. డీజే టిల్లు(DJ Tillu), టిల్లు స్వ్కేర్(Tillu Square) మూవీలతో సూపర్ సక్సెస్ లు అందుకున్న సిద్ధుకి ఆ సినిమాల తర్వాత మరో సక్సెస్ దక్కలేదు. మొన్నా మధ్య చేసిన జాక్(Jack), రీసెంట్ గా వచ్చిన తెలుసు కదా(Telusu Kada) సినిమాలు సిద్ధుకి అనుకున్న ఫలితాల్ని అందించలేకపోయాయి.
ఇక అసలు విషయానికొస్తే రీసెంట్ గా సిద్ధూ తెలుసు కదా అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. దీపావళి సందర్భంగా రిలీజైన ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చి అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయింది. నీరజ కోన(Neeraja Kona) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి పోటీగా పలు సినిమాలు రావడంతో ఆ ఎఫెక్ట్ కూడా కొంతవరకు తెలుసు కదా సినిమాపై పడింది.
అందుకే ఈ సినిమా టోటల్ రన్ విషయంలో మిగిలిన దీపావళి సినిమాల కంటే వెనుకపడింది. అయితే థియేటర్లలో అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయిన తెలుసు కదా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. నవంబర్ 13 నుంచి తెలుసు కదా సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్(Netflix) లో స్ట్రీమింగ్ కు రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.







