Telusu Kada: ‘తెలుసు కదా’ లో వరుణ్ క్యారెక్టర్ ఒక్క చుక్క రక్తం చిందించకుండా ఎమోషనల్ వార్, సైకలాజికల్ వైలెన్స్ ని జనరేట్ చేస్తాడు – సిద్ధు జొన్నలగడ్డ

మిరాయ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’ (Telusu Kada). స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. టీజర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. తెలుసు కదా అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. అందరికీ హాయ్. ఈరోజు చాలా బాధగా ఉంది. ఒక ఏడాదిగా చాలా రాడికల్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. ఒక వింత మనిషి బుర్రలో బతుకుతున్నాను. ఎల్లుండి సినిమా రిలీజ్ కాబోతుంది. వరుణ్ అనే క్యారెక్టర్ కి గుడ్ బై చెప్పేయాలి. నేను ఎందుకు ఆ క్యారెక్టర్ గురించి అంత పర్టికులర్ గా చెప్తున్నాను అంటే సినిమా చూస్తున్నప్పుడు మీకు అర్థం అవుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అందుకే లాస్ట్ టైం వరుణ్ లాగా ఉందామనుకుంటున్నాను. అందుకే తన దగ్గరికి వెళ్లి తన షర్ట్ కూడా తీసుకొచ్చాను. వరుణ్ నాకు రెండు కండిషన్స్ పెట్టాడు. ఇక్కడున్న ఆడపిల్లలు అందరితో మాట్లాడమన్నాడు. అమ్మాయిలతోనే సృష్టి మొదలైంది. మేము మీ ముందు చాలా నిమిత్త మాత్రులం. మేము ఏదైనా చిన్న తప్పు చేసినా మీరు పెద్దమనుసు చేసి క్షమించేయాలి. మీరు గొప్ప మేము గొప్ప అని డిస్కషన్ లేదు. మీరే గొప్ప. మీ వల్ల మేము గొప్ప. ఇప్పుడు బాయ్స్ తో మాట్లాడదాం. ఎప్పుడైనా ఒక అమ్మాయి మీ మనసు విరగ్గొట్టి వెళ్లిపోతే వెళ్లిపోనివ్వండి. లేదు అలా కాదు ఆమె వెంట పడితే మాత్రం మీ మీద మీకున్న మర్యాద పోతుంది. అబ్బాయిలకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరెస్టులో ఉండాలి. మనసు విరుగుతుంది, బాధేస్తుంది. రానివ్వండి.
అసలు కథ అక్కడే మొదలవుతుంది. అప్పుడు వరుణ్ లాంటివాడు మీ నుంచి బయటకు వస్తాడు. మన ఎమోషన్స్ మన కంట్రోల్ లో ఉండాలని అర్థమవుతుంది. పవర్ కంట్రోల్ మనసులో మెయింటైన్ అవ్వాలి. ఇంకేమైనా డౌట్లు మిగిలిపోయి ఉంటే అక్టోబర్ 17న థియేటర్స్ కి వచ్చి తెలుసు కదా సినిమా చూడండి. ఈ సినిమాలో వరుణ్ అనే క్యారెక్టర్ ఒక్క చుక్క రక్తం చిందించకుండా ఎమోషనల్ వార్, సైకలాజికల్ వైలెన్స్ ని జనరేట్ చేస్తాడు. అది నా ప్రామిస్ .బెర్ముడా ట్రయాంగిల్ మీద నుంచి షిప్ వెళ్లిన ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళినా దానిలోకి లాగేసుకుంటుంది. తెలుసు కదా కూడా అలాంటి లవ్ ట్రయాంగిల్. ఈ సినిమా చూసిన వాళ్ళందరినీ కూడా అది లాగేస్తుంది. వరుణ్ క్యారెక్టర్ కి గుడ్ బై చెప్పడం నిజంగా బాధగా ఉంది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. పండక్కి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రియదర్శి మిత్రమండలి, కిరణ్ అబ్బవరం కే ర్యాంప్, ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్, సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా. మంచి సినిమా విన్ అవ్వాలని కోరుకుంటున్నాను.
హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇది చాలా స్పెషల్ ఫిలిం. నాకు కథ చాలా నచ్చింది. ఇందులో రాగానే క్యారెక్టర్ లో కనిపిస్తాను. నీరజ అద్భుతంగా రాసింది. నీరజ గారి విజన్ మీ అందరికీ నచ్చుతుంది. తన నుంచి మరిన్ని మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. జ్ఞాన శేఖర్ గారు సినిమాని అద్భుతంగా విజువలైజ్ చేశారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. మా ప్రొడ్యూసర్స్ విశ్వ గారికి కృతి గారికి థాంక్యూ. ఈ సినిమాకి వాళ్ళు బ్యాక్ బోన్. తమన్ గారు అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు రాశిఖన్నాతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంజలి క్యారెక్టర్ ని అద్భుతంగా పెర్ఫాం చేసింది. సిద్దు గారి జర్నీ ఇన్స్పిరేషన్. తను వండర్ఫుల్ కోస్టర్. తనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. అక్టోబర్ 17న సినిమా థియేటర్స్ లో చూడండి తప్పకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది.
హీరోయిన్ రాశి ఖన్నా మాట్లాడుతూ… తెలుసు కదా నా మనసుకు చాలా దగ్గర సినిమా. చాలా కష్టపడ్డాం. ఇంత అద్భుతమైన క్యారెక్టర్ చేసిన రాసినందుకు నీరజాకి థాంక్యూ. జ్ఞాన్ శేఖర్ గారు ప్రతి ఫ్రేమ్ ని ఒక పెయింటింగ్ లాగా తీశారు. తమన్ గారు హిట్ ఆల్బమ్ ఇచ్చారు. సిద్దు హర్ష శ్రీనిధి నన్ను అందరిని ఒక కొత్త కోణంలో చూస్తారు. శ్రీనిధి చాలా కష్టపడింది. తన బ్యూటిఫుల్ సోల్. తనతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. సిద్దుకి సినిమా అంటే పిచ్చి. అంత ఫ్యాక్షన్ ఉన్న కోస్టార్ ని నేను ఎప్పుడు చూడలేదు. ఈ సినిమా చూసిన తర్వాత మీరు టిల్లును కూడా మర్చిపోతారు. అక్టోబర్ 17న తప్పకుండా ఈ సినిమా అందరూ చూడాలని కోరుకుంటున్నాను.
ప్రొడ్యూసర్ కృతి ప్రసాద్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. తెలుసు కదా నాకు చాలా స్పెషల్ ఫిలిం. ఈ కథ విన్నప్పుడే చాలా కనెక్ట్ అయ్యాను. తప్పకుండా మీరు కూడా కనెక్ట్ అవుతారని భావిస్తున్నాను. అక్టోబర్ 17న అందరూ సినిమాని బిగ్ స్క్రీన్ లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ నీరజకోన మాట్లాడుతూ.. విశ్వ గారికి కృతికి థాంక్యూ సో మచ్ ఫస్ట్ టైం డైరెక్టర్ కి వాళ్ళు ఇచ్చిన సపోర్టు మర్చిపోలేను ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణం మా నిర్మాతలే సిద్దు లేకుండా ఈ సినిమా ఉండేది కాదు ఈ సినిమాకి తను బ్యాక్ బోన్ నిధి రాశికి థాంక్యూ వాళ్ళిద్దరూ ఈ ప్రాజెక్టుకి రావడం అదృష్టంగా భావిస్తున్నాను ఈ ముగ్గురు సినిమాకి పిల్లర్స్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు హర్ష క్యారెక్టర్ మీ అందరిని అలరిస్తుంది జ్ఞాన శేఖర్ గారు అద్భుతంగా విజువల్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్ అసెట్ రెండు పాటలు పెద్ద హిట్ అయ్యాయి బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంటుంది మేం తీసిన సినిమాని మాకు కొత్తగా చూపించింది ఎడిటర్ నవీన్ ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
వైవా హర్ష మాట్లాడుతూ.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలల్ని నిజం చేసే ఫ్యాక్టరీ. వాళ్ల వల్ల ఎన్నో వేల కుటుంబాలు బతుకుతున్నాయి. ఇంత మందికి మంచి చేస్తున్నారంటే వాళ్ళు ఇంకా బాగుండాలి. మా డైరెక్టర్ మల్టీ స్టారర్. స్టైలిష్ నుంచి రైటర్ అక్కడి నుంచి స్టోరీ టెల్ల.ర్ సినిమాని అద్భుతంగా తీశారు. టెక్నికల్ టీం అందరూ అద్భుతంగా పనిచేశారు. తమన్ అన్న మ్యూజిక్ సెలబ్రేట్ చేసుకునేలా ఉంటుంది. సిద్దుతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. ప్రతి సీన్ ని ఇంకా అద్భుతంగా వచ్చేలా ఇంప్రవైజ్ చేస్తుంటారు. ఈ సినిమాకి ఆయన సపోర్టు మర్చిపోలేనిది. అక్టోబర్ 17న తప్పకుండా ఈ సినిమా అందరూ చూడాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ రవికాంత్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాను. చాలా బాగుంది. ఫెంటాస్టిక్. సిద్ధూలో మరో కోణం చూస్తారు. మీరు ఎప్పుడూ అలా చూసి ఉండరు. సిద్దు ఈ జనరేషన్ స్టార్. అందరు కూడా అద్భుతంగా పెర్ఫాం చేశారు. నీరజాకి ఆల్ ది బెస్ట్. తప్పకుండా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది.
లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఒక పాట రాశాను. ఆ పాట తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. సిద్దు ఈ సినిమాలో చించేసాడు. రాశి శ్రీనిధి హర్ష మిమ్మల్ని అందరిని అలరిస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన తమన్ గారికి ధన్యవాదాలు. నీరజ గారు సినిమా అద్భుతంగా సినిమా తీశారు. ప్రేమలోని మరో కోణాన్ని చూపించారు. కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది.
డిఓపి జ్ఞాన శేఖర్ మాట్లాడుతూ.. ఈ సినిమా బ్యూటిఫుల్ జర్నీ. ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేశాం. సిద్దు నీరజ కృతి రాశి అందరితో పని చేయడం బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. తప్పకుండా ఈ సినిమా మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తుంది.