Tarakeswari: ఘనంగా ‘తారకేశ్వరి’ ప్రీ-రిలీజ్ వేడుక
                                    – నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్న సస్పెన్స్ థ్రిల్లర్
తెలుగు ప్రేక్షకుల ముందుకు చాలా రోజుల తర్వాత ఓ సస్పెన్స్ సెంటిమెంటల్ థ్రిల్లర్ రాబోతోంది. శ్రీ శివ సాయి ఫిలిమ్ బ్యానర్‌పై వెంకట్ రెడ్డి నంది స్వీయ దర్శకత్వంలో, శ్రీకరణ్ – అనూష – షన్ను హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘తారకేశ్వరి’ (Tarakeswari). ఈ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో భవ్యంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో సినీ, సాహిత్య, సంగీత రంగ ప్రముఖులు పాల్గొని చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
అన్విక ఆడియో అధినేత సంజీవ్ మేగోటి మాట్లాడుతూ –
“గతేడాది నా దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిపర్వం’ మంచి పేరు తెచ్చుకుంది. అమ్మవారి ఆశీర్వాదంతో ‘తారకేశ్వరి’ ఆడియోను మా అన్విక ఆడియో సంస్థ ద్వారా విడుదల చేయడం ఆనందంగా ఉంది. దర్శకుడు వెంకట్ రెడ్డి గారు అద్భుతంగా సినిమాను తీర్చిదిద్దారు. నటీనటులందరూ తమ టాలెంట్‌తో సినిమాకు బలాన్ని ఇచ్చారు. ఈ చిత్రం తప్పకుండా సూపర్‌హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.
‘మీలో ఒకడు’ హీరో కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ –
“‘తారకేశ్వరి’ పాటలు విన్నాను, డ్రమ్స్ రాము అందించిన సంగీతం అద్భుతంగా ఉంది. నవంబర్ 7న విడుదల కానున్న ఈ చిత్రాన్ని అందరూ తప్పకుండా ప్రోత్సహించాలి. ఇప్పటివరకు 16 సినిమాలు చేసిన వెంకట్ రెడ్డి గారు ఎంతో మందికి ఉపాధి కల్పించారు. కళామాతను నమ్ముకొని ఎన్నోమందికి అవకాశాలు ఇస్తున్నారు. ఈ సినిమా హిట్ అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను” అన్నారు.
నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ –
“హీరోయిన్ అనూషకు మంచి భవిష్యత్తు ఉంది. పెద్ద స్టార్లు కూడా మొదట్లో కష్టాలు ఎదుర్కొన్నారు. వెంకట్ రెడ్డి గారు కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తారు, వారి ప్రతిభను వెలికి తీయడంలో ప్రత్యేకం” అన్నారు.
దర్శకుడు, నిర్మాత వెంకట్ రెడ్డి నంది మాట్లాడుతూ –
“‘తారకేశ్వరి’ కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం. ఈ స్థాయికి రావడంలో మొత్తం చిత్రయూనిట్ కృషి ఉంది. నవంబర్ 7న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు ప్రేక్షకుల ఆశీర్వాదాలు కావాలి” అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ డ్రమ్స్ రాము మాట్లాడుతూ –
“వెంకట్ రెడ్డి గారి 16 సినిమాల్లో సగానికి పైగా నేను సంగీతం అందించాను. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం నాకు గర్వంగా ఉంది. ఈ సినిమాకి సంగీతం చాలా చక్కగా కుదిరింది. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం ఉంది” అన్నారు.
హీరో శ్రీకరణ్ మాట్లాడుతూ –
“‘తారకేశ్వరి’ ఓ పల్లెటూరి యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా. గ్రామీణ వాతావరణంలో జరిగిన షూటింగ్ అనుభవం ఎంతో ప్రత్యేకం. దర్శకుడు వెంకట్ రెడ్డి నంది గారు అద్భుతమైన కథను తెరపై చూపించారు. నవంబర్ 7న థియేటర్లలో చూసి పెద్ద హిట్ చేయాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను” అన్నారు.
హీరోయిన్ అనూష మాట్లాడుతూ –
“సినీ రంగంలోకి రావడం అమ్మాయిలకు అంత సులభం కాదు. నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ అవకాశం దక్కింది. తొలి అవకాశం ఇచ్చిన వెంకట్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సినిమా అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉంది” అన్నారు.
చిత్రయూనిట్ సభ్యులు మాట్లాడుతూ –
“ట్రైలర్‌కు ఇప్పటికే అద్భుతమైన స్పందన లభించింది. చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తే కొత్త టాలెంట్‌కు మరిన్ని అవకాశాలు వస్తాయి” అన్నారు.







