వెబ్ సిరీస్‌లతో తమన్నా బిజీ
హ్యాపీడేస్ తో తెలుగు చిత్రసీమకి పరిచయమైన మిల్కీ బ్యూటీ తమన్నా, తన అందచందాలతో అభినయంతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ టాలెంట్ తోనే అగ్ర హీరోలతో నటించింది. సినిమాలు, స్పెషల్ సాంగ్స్ , వెబ్ సిరీస్ అంటూ బిజీ బిజీగా తన లైఫ్ ని సెట్ చేసుకొంది ఈ భామ.
ఇదిలా ఉండగా ప్రెజెంట్ తమన్నా వెబ్ సిరీస్ పైన కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా జీ కర్దే మరియు లస్ట్ స్టోరీస్ 2 సినిమాలు ఆమెకు బాగానే పేరు తీసుకొచ్చాయి. అయితే ఈ భామ ‘ ఆఖ్రి సచ్ ‘ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మూవీ ఆగస్టు 25 న హాట్ స్టార్ లో విడుదల కానుంది.
ఈ మూవీ కథ ఏమీ కొత్తది కాదు. 2018 లో దేశ రాజధాని అయిన ఢిల్లీలోని బురారీ అనే ప్రాంతంలో చందావత్ అనే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అప్పట్లో సంచలమైన వార్త. అసలు అవి హత్యలా లేక ఆత్మ హత్యలా అని తేల్చడానికి పోలీసులు చాలానే కష్టపడ్డారు. ఇదే కథని ఆధారంగా చేసుకొని ఇదివరకే నెట్ ఫ్లిక్స్ లో ఓ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ కూడా వచ్చింది. అయితే ఆ డాక్యుమెంటరీ, ఈ మూవీకీ చాలా భిన్నంగా ఉండేటట్లు నిజమైన లొకేషన్స్ లో దీన్ని నిర్మించారు. ఇలా అన్ని ఘటనలు నిజానికి దగ్గరగా ఒరిజినల్ స్టోరీని మార్పులు చేయకుండా అలానే చిత్రీకరించారట.













