Tabu: డిజైనర్ వేర్ లో మరింత హుందాగా టబు
టాలీవుడ్ లోని అగ్ర హీరోలందరితో నటించిన టబు(tabu) బాలీవుడ్ లో కూడా సుదీర్ఘ కాలం యాక్టింగ్ లో రాణించింది. వయసు పెరుగుతున్నప్పటికీ టబు ఫ్యాషన్ సెన్స్ లో ఎప్పుడూ ముందుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే టబు ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ ను బాగా ఫాలో అవుతూ ఉంటుంది. తాజాగా టబు ఓ డిజైనర్ లుక్ లో మెరుపులు మెరిపించింది. అబు సందీప్(Abu Sandeep) జోడీ ఐకానిక్ ఆర్కిటెక్చరల్ కోట్ లో ఎంతో ఎట్రాక్టివ్ గా కనిపించింది. ఈ బ్లాక్ కలర్ డిజైనర్ వేర్ లో టబు మరింత హుందాగా కనిపిస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది.






