Hari Hara Veera Mallu: వీరమల్లు నుంచి ఇంప్రెస్సివ్ సాంగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), నిధి అగర్వాల్(Niddhi Agerwal) జంటగా క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi), జ్యోతి కృష్ణ(jyothi Krishna) దర్శకత్వం వహించిన భారీ పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu). కరోనాకు ముందు మొదలైన ఈ సినిమా షూటింగ్ లేటవడంతో వాయిదాలు పడుతూ ఆఖరికి ఇప్పుడు రిలీజ్ కు రెడీ అవుతుంది. జూన్ 12న వీరమల్లు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ తాజాగా ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు. తార తార(taara taara) అంటూ కొనసాగే ఈ పాట చాలా సూథింగ్ గా ఆడియన్స్ కు కిక్ ఇచ్చేలా ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా కాలం తర్వాత పవన్ నుంచి ఇలాంటి రొమాంటిక్ సాంగ్ వచ్చింది. కీరవాణి(keeravani) సంగీతం అందించిన ఈ ట్యూన్ కు శ్రీ హర్ష(Sri Harsha) సాహిత్యం అందించగా, లిప్సిక భాష్యం(Lipsika Basyam) ఈ పాటను పాడింది.
సాంగ్ కంపోజిషన్ మాత్రమే కాదు, సాంగ్ లోని విజువల్స్ కూడా చాలా స్పెషల్ గా సాంగ్ మూడ్ కు తగ్గట్టు బాగా కుదిరాయి. సాంగ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ క్యామియోలు కూడా కనిపించడం విశేషం అయితే ఇందులో నిధి అగర్వాల్, తన గ్లామర్, అమ్మడి డ్యాన్సులు సాంగ్ ను మరింత స్పెషల్ గా మార్చాయి. మొత్తానికి వీరమల్లు నుంచి వచ్చిన కొత్త పాటైతే ఆడియన్స్ అటెన్షన్ ను లాగేసుకుంది. పవన్ నుంచి రెండేళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.