కంగువా సినిమాకు భారీ ప్లాన్స్
గత కొన్నాళ్లుగా కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉన్న తమిళ నటుడు సూర్య, ఇప్పుడు ఓ యోధుడి కథతో ప్రేక్షకులని మెప్పించాలని చూస్తున్నాడు. శివ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా పేరు కంగువా. పోస్టర్స్ తోనే ఆసక్తిని పెంచిన కంగువా, గ్లింప్స్ రిలీజయ్యాక అంచనాలు రెట్టింపయ్యాయి. గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తుంది. దేవీ శ్రీ మ్యూజిక్ అందిస్తున్న కంగువా రూ. 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రూ.1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని దర్శకనిర్మాతలు ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నారు.
అయితే ఈ కంగువా సినిమా బాహుబలి, కేజీఎఫ్, పుష్ప తరహాలోనే రెండు, మూడు పార్ట్ లుగా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే వాటికి సంబంధించిన స్టోరీలు కూడా రెడీ చేశారని, కంగువా రిజల్ట్ పై వాటి సీక్వెల్ ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. కాగా కంగువా సినిమిఆ ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.













