Suriya Vs Vikram: సూర్య వర్సెస్ విక్రమ్ నిజమేనా?
కంగువా(Kanguva) సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya), ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) దర్శకత్వంలో రెట్రో(Retro) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్ గా నటిస్తుండగా, రెట్రో మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెట్రో పై సూర్య, అతని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
అయితే రెట్రోకు పోటీగా ఇప్పుడు మరో సినిమా కూడా వస్తోందని కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. విక్రమ్(Vikram) హీరోగా గౌతమ్ మీనన్(Goutham Menon) దర్శకత్వంలో తెరకెక్కిన ధృవ నక్షత్రం(Dhruva Nakshatram) సినిమాను మే 1న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కోలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం ధృవ నక్షత్రం సినిమాకు సంబంధించిన అన్ని ఆర్థిక సమస్యలు తొలిగాయని అంటున్నారు.
త్వరలోనే ధృవ నక్షత్రం సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. అదే జరిగితే ధృవ నక్షత్రం, రెట్రో రెండూ బాక్సాఫీస్ వద్ద క్లాష్ అవుతాయి. ఈ రెండు సినిమాలూ ఒకేరోజు రిలీజవడం వల్ల ఆ ఎఫెక్ట్ బాక్సాఫీస్ కలెక్షన్లపై పడుతుందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. మరి ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.













