కోవిడ్ బాధితుల కోసం సూర్య, కార్తీ కోటీ విరాళం

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకీ కొత్త కరోనా మరణాలు నమోదవుతున్నాయి. సకాలంలో వైద్యం, ఆక్సిజన్ అందక కోవిడ్ బాధితుల సొంతవారి కళ్ల ముందే ప్రాణాలు వదులుతున్నారు. ఇక బాధితుల్ని రక్షించేందుకు ప్రభుత్వాలు, ఫ‍్రంట్ లైన్ వారియర్స్ అహర్నిశలు కృషి చేస‍్తున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. కోవిడ్ బాధితుల కోసం తమవంతు బాధ్యతగా విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా హీరో సూర్య, కార్తీలు తండ్రి శివ కూమార్‌తో కలిసి తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటీ రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం కార్యాలయానికి వెళ్లి రూ. కోటీ చెక్‌ను ముఖ్యమంత్రి స్టాలిన్ చేతికి అందించారు. ఆ తర్వాత రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైందుకు అభినందనలు తెలుపుతు సూర్య, ఆయన తండ్రి శివ కుమార్ పుష్ప గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సూర్య, కార్తీ, శివకుమార్లు మీడియాతో ముచ్చటించారు. త్వరలో తెలుగు రాష్ట్రాలకు కూడా ప్రకటించనున్నారని తెలుస్తోంది.