Retro: సూర్య రెట్రో టీజర్ టాక్
ఎన్నో ఆశలు పెట్టుకుని పాన్ ఇండియా స్థాయిలో జెండా పాతాలని సూర్య(Suriya) చేసిన కంగువ(Kanguva) సినిమా కోలీవుడ్ లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా మిగిలింది. గత కొంతకాలంగా సూర్య సినిమాల ఎంపిక చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. కథలు, డైరెక్టర్ల ఎంపికలో చేస్తున్న తప్పుల వల్లే తన మార్కెట్ తగ్గిపోతుంది. ప్రస్తుతం సూర్య తన 44వ సినిమాను కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాకు రెట్రో(Retro) అనే టైటిల్ ను ఫిక్స్ చేసి క్రిస్మస్ సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో కథను ఆల్మోస్ట్ రివీల్ చేశారు. ఒక డాన్ కొడుకు తండ్రి మాఫియా వారసత్వాన్ని మోస్తూ రక్తపాతం, హింస మధ్యలో బతుకుతూ ఉండగా అతనికి ఓ అందమైన అమ్మాయి పరిచయమవుతుంది. ఆమె కోసం అన్నీ వదిలేసి మామలూగా మారాలని డిసైడ్ అవుతాడు.
ఈ నేపథ్యంలోనే కొత్త జీవితాన్ని కూడా మొదలుపెడతాడు. అయితే నేరాలతో నిండిపోయిన గత చరిత్ర తాలూకు మరకలు అతన్ని వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి టైమ్ లో అతనేం చేశాడనేదే కథగా అర్థమవుతుంది. కథ కొత్తగా లేకపోయినప్పటికీ యాక్షన్ సీన్స్, రెండు గెటప్స్ లో సూర్య లుక్స్, కార్తీక్ సుబ్బరాజ్ ఇంటెన్స్ టేకింగ్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. సంతోష్ నారాయణన్(Santhosh Narayanan) బీజీఎం టీజర్ ను బాగా ఎలివేట్ చేసింది. వీటన్నింటితో పాటూ పూజా హెగ్డే(Pooja Hegde) చాలా హోమ్లీ లుక్ లో కనిపించి షాకిచ్చింది. నెక్ట్స్ ఇయర్ సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.













