సూర్య, నజ్రియా నజీమ్, జితు మాధవన్, ఝగారం స్టూడియోస్, 2D ఎంటర్టైన్మెంట్ ‘సీన్’ టైటిల్ గ్లింప్స్
వరుస బ్లాక్‌బస్టర్స్‌తో దూసుకెళ్తున్న స్టార్ హీరో సూర్య.. మలయాళ దర్శకుడు జితు మాధవన్‌తో కలిసి తన 47వ చిత్రాన్ని చేస్తున్నారు. ‘ఆవేశం’ ఫేమ్ జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘సీన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తుండగా.. ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియాన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
యాక్షన్-కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని జఘరం స్టూడియోస్, 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై జ్యోతిక, సూర్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జయశ్రీ దామోదరన్ కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ‘సీన్’ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. అలాగే ఈ సినిమాను దీపావళి సందర్భంగా నవంబర్ 6, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
టైటిల్ గ్లింప్స్ ప్రారంభంలో సూర్య ఓ విచిత్రమైన పోలీస్ ఆఫీసర్‌గా వాయిస్ ఓవర్ ద్వారా పరిచయం చేశారు. అక్కడి నుంచే ఆసక్తికరమైన, ఫన్నీ టోన్‌ను సెట్ చేశారు. ఓ క్రైమ్ సీన్‌కు అతని ఎంట్రీ మరింత ఫన్ను తీసుకొస్తుంది. అదే సమయంలో ఈ క్యారెక్టర్‌ను సైకోగా కూడా పేర్కొంటూ.. ఒకే చోట కూర్చొని సిగరెట్ తాగే అలవాటు ఉన్న వ్యక్తిగా చూపించారు.
అయితే సూర్య అసలు ఇంట్రడక్షన్‌ను మాత్రం గ్లింప్స్‌లో అదిరిపోయేలా డిజైన్ చేశారు. DSP ప్రేమ్‌రాజ్ గా సూర్య పవర్ఫుల్ ఎంట్రీ అదిరిపోయింది. ఓ కానిస్టేబుల్ భుజంపై చేయి వేసుకుని నడుస్తూ వచ్చే సూర్య.. ఎంత కష్టమైన క్రిమినల్ అయినా అతడిని ట్రాక్ చేసి పట్టుకోగల తన ప్రత్యేక సామర్థ్యాన్ని తెలియజేసే పవర్ఫుల్ డైలాగ్ చెప్పడం ఆకట్టుకుంది. తనదైన స్టైల్లో ఇచ్చే వార్నింగ్ మరింత ఇంపాక్ట్‌ను క్రియేట్ చేస్తుంది.
కిక్యాస్ ప్రెజెన్స్‌తో సూర్య స్క్రీన్‌ను అదరగొట్టారు. తన ప్రత్యేకమైన వాక్, కమాండింగ్ బాడీ లాంగ్వేజ్, పంచ్‌తో కూడిన డైలాగ్ డెలివరీతో స్వాగ్, యాటిట్యూడ్‌ను ప్రజెంట్ చేశారు. హీరో క్యారెక్టర్స్‌ను ఎక్స్సెంట్రిక్గా, ఎంటర్టైనింగ్గా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు జితు మాధవన్ తన మార్క్ చూపించారు.
సినిమాటోగ్రాఫర్ వినీత్ అగస్టిన్ స్టైలిష్ విజువల్స్ ఆకట్టుకున్నాయి.. సుశిన్ శ్యామ్ ఎలక్ట్రిఫైయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో గ్లింప్స్‌కు మరింత ఎనర్జీ తీసుకొచ్చారు. అజ్మల్ సాబు ఎడిటింగ్,.. అశ్విని కాలే ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షిస్తున్నారు.
‘సీన్’ టైటిల్ గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. వరుస విజయాలతో దూసుకెళ్తున్న సూర్యకు ఇది హ్యాట్రిక్ ధమాకా అవుతుందంటూ అభిమానులు గ్లింప్స్‌ను సెలబ్రేట్ చేస్తున్నారు.








