దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ మూవీ ‘ఆకాశంలో ఒకతార’
వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ మూవీ ‘ఆకాశంలో ఒకతార’ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ ఈరోజు అనౌన్స్ చేశారు. ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ సాధినేని దర్శకుడు. ఈ చిత్రాన్ని లైట్‌బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి.
‘ఆకాశంలో ఒక తార’ సినిమాను నవంబర్ 20న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ అందమైన సినిమాను ప్రతి ఒక్కరికీ చేరువ చేసేలా టీమ్ భారీ స్థాయిలో డిఫరెంట్ స్టైల్ ప్రమోషన్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. రీసెంట్గా విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘చిట్టి చిట్టి చీమ’ పాటకు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట మ్యూజిక్ లవర్స్‌కు అడిక్షన్‌గా మారుతోంది. నేషనల్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ తో మూవీపై పాజిటివ్ వైబ్స్, ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకెళ్తున్న దుల్కర్ సల్మాన్.. దర్శకుడు పవన్ సాధినేని క్రియేటివ్ విజన్‌తో తెరకెక్కుతున్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటంతో.. ఈ సినిమా ప్రత్యేకమైన, గుర్తుండిపోయే ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది.
టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ సుజిత్ సారంగ్ ఈ సినిమాకు కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. శ్వేతా సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతటి బలమైన టెక్నికల్ టీమ్, మంచి నటీనటులతో తెరకెక్కుతోన్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతోంది.








