Pawan Kalyan: పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం
ఓజి(OG) మూవీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) తిరిగి ఫామ్ లోకి వచ్చారు. ఓజితో తన బాక్సాఫీస్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసుకున్న పవన్ చేతిలో ప్రస్తుతం ఉస్తాద్ భగత్‌సింగ్(Ustaad bhagath singh) మూవీ ఉంది. ఈ సినిమాకు సంబంధించిన పవన్ పోర్షన్ షూటింగ్ ఆల్రెడీ పూర్తైపోయింది. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ మరో సినిమాకు సైన్ చేసింది లేదు.
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ తర్వాతి సినిమాల విషయంలో అన్నీ ఆలోచించి డిసైడ్ అవాలనుకుంటున్నారట. అంతేకాదు, గతంలో తాను డేట్స్ ఇచ్చిన నిర్మాతలకు కూడా సినిమాలు చేయాలని పవన్ భావిస్తున్నారని అంటున్నారు. అయితే పవన్ గతంలో రామ్ తాళ్లూరి(ram thalluri) అనే నిర్మాతకు డేట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
రెండేళ్ల కిందట రామ్ తాళ్లూరి నిర్మాణంలో పవన్ హీరోగా ఓ సినిమా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. భారీ బడ్జెట్ తో రానున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వం వహిస్తాడని, వక్కంతం వంశీ(vakkantham vamsi) కథను అందిస్తారని అన్నారు. కానీ ఎందుకో కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడా ప్రాజెక్టు పట్టాలెక్కే ఛాన్సుందంటున్నారు. వక్కంతం వంశీ ఆల్రెడీ పవన్ కోసం రెండు స్క్రిప్టులను రెడీ చేశారని, పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే లేటని అంటున్నారు. మరి సురేందర్ రెడ్డికి పవన్ ఓకే చెప్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.













