వెంకీ 76 ఎవరితో?
ఏజెంట్ సినిమా భారీ డిజాస్టర్ అయినప్పటికీ దాని ఎఫెక్ట్ మాత్రం డైరెక్టర్ సురేందర్ రెడ్డిపై పడలేదు. ఏజెంట్ కు ముందే సురేందర్ రెడ్డికి పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఆఫర్ రావడంతో ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు సురేందర్ రెడ్డికి సంజీవనిలా మారింది. దీంతో పాటూ ఆయనకు మరో బంపరాఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం శైలేష్ కొలను తో తన 75వ సినిమాగా సైంధవ్ చేస్తున్న వెంకటేష్, తన తర్వాతి సినిమాను అంటే 76వ సినిమాను సురేందర్ రెడ్డితో చేసే అవకాశాలున్నాయని బలమైన టాక్ వినిపిస్తోంది. సైంధవ్ తర్వాత ఏ సినిమా చేయాలనేది వెంకీ ఇంకా ఫిక్స్ కాలేదు. మరోవైపు సూరి చేతిలో ఉన్న పవన్ ప్రాజెక్ట్ మొదలవడానికి కూడా బాగా టైమ్ పట్టేట్లుంది.
అందుకే పవన్ ఫ్రీ అయ్యే లోపు వెంకీతో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్టోరీని తీయాలని సూరి ప్లాన్ చేస్తున్నాడట. దీనికి సంబంధించి సూరి ఇప్పటికే గతంలో వెంకీ, సురేష్ బాబుకు కథ కూడా చెప్పాడని దానికి వారిద్దరూ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారని తెలుస్తోంది. దీంతో వెంకీ నెక్ట్స్ సినిమా సూరితోనే అని వార్తలొస్తున్నాయి. కానీ వెంకీ ఇప్పటికే అనుదీప్ తో సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు. మరి ఈ ఇద్దరిలో వెంకీ ఎవరితో సెట్స్ పైకి వెళ్తాడో చూడాలి.













