Rajinikanth: లోకేష్ ను రాజమౌళితో పోల్చిన సూపర్ స్టార్
టాలీవుడ్ లో అపజయమంటూ ఎరుగని డైరెక్టర్ గా రాజమౌళి(rajamouli)కి ప్రత్యేక పేరు, గుర్తింపు ఉన్నాయి. ఇప్పటివరకు ఆయన దర్శకత్వం వహించిన ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాపుగా నిలిచింది లేదు. ఇంకా చెప్పాలంటే సినిమా సినిమాకీ రాజమౌళి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు. అలాంటి రాజమౌళితో సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) మరో డైరెక్టర్ ను పోల్చారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కూలీ(Coolie) అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) దర్శకత్వం వహించారు. శృతి హాసన్(Shruthi Hassan), నాగార్జున(Nagarjuna), ఆమిర్ ఖాన్(aamir khan), ఉపేంద్ర(upendra), సౌబిన్ షాహిర్(soubin shahir) కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా అందులో రజినీకాంత్ వీడియో ద్వారా మాట్లాడారు.
ఆ వీడియోలో రజినీకాంత్ మాట్లాడుతూ, టాలీవుడ్ కు రాజమౌళి ఎలానో కోలీవుడ్ కు లోకేష్ కనగరాజ్ అలా అని సూపర్ స్టార్ అన్నారు. లోకేష్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ హిట్టేనని, లోకేష్ కేవలం సక్సెస్ఫుల్ డైరెక్టర్ మాత్రమే కాదని, ఆయనెంతో మంచి వాడని కూడా రజినీ చెప్పారు. కూలీ సినిమాలో స్టార్లందరూ నటించడానికి కారణం కూడా లోకేషేనని, అతని వల్లే ఇదంతా సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.







