సన్నీలియోన్ నటిస్తున్న 100 కోట్ల భారీ చిత్రం వీరమహాదేవి
స్టివ్స్ కార్నర్ పతాకంపై ఫోన్స్ స్టీఫెన్ నిర్మాతగా వి .సి.వడివుడయాన్ దర్శకత్వంలో సన్నీలియోన్ నటిస్తున్న భారీ చారిత్మాత్మక చిత్రం వీరమహాదేవి. 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఒకేసారి 5 భాషల్లో షూటింగ్ జరుపుకొంటుంది. సన్నీలియోన్ తెలుగులో మొదటిసారి నటిస్తున్నందున ఆమె తెలుగు నేర్చుకొంటున్నారు. నాజర్ మరియు తమిళ్,మలయాళం, కన్నడ మరియు హిందీ భాషలలోని ప్రముఖ నటులు ఇందులో నటిస్తున్నారు. యుద్ధ సన్నివేశాలకొరకు సుమారు 1000 గుర్రాలు మరియు ఏనుగులు ఉన్నందున నటీనటులకు గుర్రపుస్వారిలో శిక్షణ ఇస్తున్నాము. సన్నీలియోన్ దుస్తులు దక్షిణభారత సంప్రదాయంలో ఉంటాయి. వీటిని ముంబై తో తయారు చేస్తున్నాము.
రామోజీఫిలింసిటీలో భారీ సెట్ వేయుటకు సన్నాహాలు చేస్తున్నాము. కేరళలోని అడవులలో ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో భారీ ఫైటింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాము. గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్నందున కెనడా లోని కంపెనీ మరియు ఇక్కడ ఒక ముఖ్య కంపెనీ కలసి పనిచేస్తున్నాయి. lord of the rings మరియు gods of the egypt చిత్రాలకు పనిచేసినవారు ఈ చిత్రానికి గ్రాఫిక్స్ పర్యవేక్షకులుగా పనిచేస్తున్నారు. గ్రాఫిక్స్ కోసం సుమారుగా 40 కోట్లు ఖర్చుపెడుతున్నాము. ఈ చిత్రం కోసం సన్నీలియోన్ 150 రోజులు కేటాయించారు. భారీఅంచనాలున్న ఈ చిత్రం ఫస్టులుక్ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదల చేస్తున్నాము.













