Sunny Deol: రామాయణలో నా పాత్ర చాలా అల్లరిగా ఉంటుంది

రామయణం ఆధారంగా ఇప్పటికే పలు సినిమాలు, సిరీయల్స్, సిరీస్‌లు రాగా వాటికి మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో రామయణ (ramayana) పేరుతో ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టి సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్(ranbir kapoor), సీతగా సాయి పల్లవి(sai pallavi) నటిస్తుండగా హనుమంతుడిగా సన్నీ డియోల్(Sunny deol) నటిస్తున్నారు.
సుమారు రూ. 4000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 45కు పైగా భాషల్లో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాలో తన పాత్ర గురించి తాజాగా సన్నీ డియోల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ సినిమాలో తాను హనుమంతుడి పాత్రలో నటిస్తున్నానని, ఆ పాత్రలో నటించడం చాలా గర్వంగా ఉందని, సినిమాలో తన పాత్ర చాలా అల్లరిగా, వినోదంగా, ఉత్సాహంగా ఉంటుందని చెప్పారు.
రామాయణం చాలా గొప్ప కథ అని, ఆ కథలో ఎన్ని సినిమాలు వచ్చినా, ఎన్నిసార్లు వచ్చినా తప్పక ఆదరణ దక్కుతుందని చెప్పిన ఆయన త్వరలోనే తన పాత్రకు సంబంధించిన షూటింగ్ మొదలవనుందని, ఇలాంటి పాత్రలు చేయడం చాలా సవాలుతో కూడుకుని ఉంటుందని, పాత్రలో పూర్తిగా లీనమైతే తప్ప మంచి అవుట్‌పుట్‌ను ఇవ్వలేమని సన్నీ డియోల్ చెప్పారు.