హాకీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే.. సందీప్ ఆశలన్నీ ఈ సినిమాపైనే..
సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా జాతీయ క్రీడ హాకీ నేపథ్యంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ఏ1 ఎక్స్ ప్రెస్. డెన్నిస్ జీవన్ డైరక్షన్ వహిస్తున్న ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరూ హాకీ ప్లేయర్స్ గానే కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్లకి ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. సందీప్ కిషన్ 25వ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను మార్చి5న ప్రేక్షకుల ముందు తీసుకురానున్నారు.
క్లీన్ యూ సర్టిఫికేట్ తో ఏ1 ఎక్స్ ప్రెస్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా హాకీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఫస్ట్ తెలుగు సినిమా అని చెప్పొచ్చు. స్పోర్ట్స్ లో పొలిటీషియన్స్ జోక్యం వల్ల ప్లేయర్స్ ఎలా బలవుతున్నారనే విషయాన్ని సినిమాలో చాలా స్ర్టాంగ్ గా చెప్పినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. దీని కోసం హీరో సందీప్ సిక్స్ ప్యాక్ చేస్తే.. లావణ్య హాకీ గురించి పట్టు సాధించడానికి అందులో శిక్షణ తీసుకుందట. హిప్ హాప్ తమీజ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ లో టీఈ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తో అయినా సందీప్ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.













