రాజమౌళి రూట్ లో సుకుమార్..?
బన్నీ, సుకుమార్ కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా పుష్ప అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బన్నీ కెరీర్ లోనే ఇది మొదటి పాన్ ఇండియన్ మూవీ. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ మొన్నీ మధ్యే బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయగా, దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ టీజర్ సినిమా మీద అంచనాల్ని మరింత పెంచింది.
బన్నీ డిఫరెండ్ గా కనిపించనున్నాడు పుష్పలో. తన లుక్ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు అన్నీ ఇంతకుముందు కంటే విభిన్నంగానే ఉన్నాయి. పుష్ప సినిమా చాలా రియలిస్టిక్ గా తెరకెక్కుతుందని టీజర్ తోనే అర్థమైపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు పుష్ప గురించి ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే పుష్ప సినిమాను రెండు పార్ట్ లుగా చేసి, రిలీజ్ చేయాలనే ఉద్ధేశ్యంలో టీమ్ ఉన్నట్లు తెలుస్తుంది.
పుష్ప సినిమా మూడు గంటలకు పైగా ఉండటంతో ఈ సినిమాను కూడా బాహుబలి లాగా రెండు పార్ట్ లుగా చేసి రిలీజ్ చేస్తే బావుంటుందనుకుంటున్నారట. ఇందులో భాగంగానే డైరక్టర్ టీమ్ కూడా సినిమాను ఇంకా డెవలప్ చేసేందుకు కథను రెడీ చేసే పనిలో ఉన్నారని అక్కడక్కడా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఏ మేర నిజముందో తెలీదు కానీ రెండు పార్ట్ లుగా చేస్తే మాత్రం రెండో పార్ట్ చూడటానికి ఆడియన్స్ కు చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంటే తప్ప ఆ ఇంట్రెస్ట్ రాదు. అంతే కాదు ఫస్ట్ పార్ట్ లో కంటెంట్ కూడా ఒక రేంజ్ లో ఉండాలి. వీటన్నింటినీ మైండ్ లో పెట్టుకుని పుష్ప మేకర్స్ ఏం డిసైడ్ అవుతారో చూడాలి.













