Sukumar: చరణ్ కోసం రూటు మారుస్తున్న సుకుమార్
డైరెక్టర్ సుకుమార్(Sukumar) కు ఓ స్పెషాలిటీ ఉంది. ఆల్రెడీ వర్క్ చేసిన హీరోయిన్ తో సుకుమార్ మళ్లీ ఎప్పుడూ వర్క్ చేసింది లేదు. పుష్ప విషయం వేరు. ఎందుకంటే పుష్ప స్టోరీని ముందు ఒకే మూవీగా చేద్దామనుకున్నారు కానీ రన్ టైమ్ ఎక్కువవడంతో పుష్ప2(Pushpa2) కూడా చేయాల్సి వచ్చిందని సుకుమార్ ఇప్పటికే చెప్పాడు.
కాబట్టి పుష్ప1(Pushpa1), పుష్ప2లో రష్మిక నటించింది కదా అనే ఛాన్స్ లేదు. పుష్ప మొత్తం ఒకే కథ కాబట్టి ఆ కథలో రష్మికనే కనిపించింది. ఇక అసలు విషయానికొస్తే పుష్ప2 తర్వాత సుకుమార్ తన నెక్ట్స్ మూవీని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan) తో చేయనున్నాడనే సంగతి తెలిసిందే. ఇప్పటికే దానికి సంబంధించి ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ సినిమా కోసం సుకుమార్ తాను పాటిస్తున్న హీరోయిన్ సెంటిమెంట్ ను పక్కనపెడుతున్నాడని తెలుస్తోంది. చరణ్ తో సుకుమార్ చేయబోయే పాన్ ఇండియా ఫిల్మ్ కోసం హీరోయిన్ గా పుష్ప హీరోయిన్ అయిన రష్మిక మందన్నా(Rashmika Mandanna)ని తీసుకోవాలని సుకుమార్ అనుకుంటున్నాడట. పుష్ప1, పుష్ప2లో రష్మిక యాక్టింగ్ కు ఫిదా అయిన సుకుమార్, రామ్ చరణ్ కోసం తన సెంటిమెంట్ ను పక్కనపెట్టి మరీ రష్మికను తీసుకోవాలనుకుంటున్నాడట. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.













