Sukumar: దేవీ శ్రీ పై ప్రేమ కురిపించిన సుకుమార్
ఆర్య(Aarya) సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన సుకుమార్(Sukumar) ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న క్రియేటివ్ డైరెక్టర్లలో ఒకడు. ఫలితంతో సంబంధం లేకుండా ఆయన సినిమాలకు ఉండే గౌరవం ఎప్పుడూ ఉంటుంది. పుష్ప(Pushpa) ముందు వరకు టాలీవుడ్‌కే పరిమితమైన సుకుమార్ క్రేజ్, ఆ సినిమా తర్వాత ఇండియన్ లెవెల్ లో పెరిగింది.
ప్రస్తుతం ఇండియాలో స్టార్ డైరెక్టర్లలో సుకుమార్ కూడా ఒకడు. పుష్ప సినిమా చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. అయితే పుష్ప ఫ్రాంచైజ్ సినిమాలకు దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) ఇచ్చిన సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప, పుష్ప2లోని ప్రతీ పాట అంతర్జాతీయ స్థాయిలో క్లిక్ అయింది. దేవీ ఏ డైరెక్టర్ తో పని చేసినా రాని అవుట్‌పుట్ సుకుమార్ సినిమాలకు వస్తుంది.
సుకుమార్ సినిమాలకు దేవీ ఇచ్చే మ్యూజిక్ చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇప్పటివరకు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ప్రతీ సినిమాకీ దేవీ శ్రీ ప్రసాదే సంగీతం అందించాడు. రీసెంట్ గా పుష్ప2 థ్యాంక్స్ మీట్ లో సుకుమార్ మాట్లాడుతూ, తన పేరు సుకుమార్ కాదని, తన పేరు సుకుమార్ దేవీ శ్రీ ప్రసాద్ అని అన్నాడు. దేవీ లేకుండా తాను ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదని, ఇక ముందు కూడా చేయలేనని సుకుమార్ తెలిపాడు. దీన్ని బట్టి చూస్తుంటే వారి మధ్య బాండింగ్ ఎంత గట్టిదో అర్థం చేసుకోవాలి.













