ఐపీఎస్ అధికారిగా సుధీర్‌బాబు
మల్టీస్టారర్ పరంపర కొనసాగుతోంది. యువ కథనాయకులు కలిసికట్టుగా సినిమాలు చేస్తున్నారు. ఆలాంటి చిత్రమే వి. నాని, సుధీర్‌బాబు కలిసి నటిస్తున్న చిత్రమిది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. శిరీష్, హర్షిత్‌రెడ్డి నిర్మాతలు. సుధీర్బాలు లుక్‌ని విడుదల చేశారు. సుధరీ ఈ చిత్రంలో ఐపీఎస్ అధికారిగా కనిపించబోతున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ నాని నటించిన 25వ చిత్రమిది. నాని, సుధీర్ పాత్రలు రెండూ పోటాపోటీగా ఉంటాయి. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణ. మార్చి 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. నివేదా థామస్, అదితీరావు హైదరీ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: అమిత్ త్రివేది.













