మహేష్‌బాబు సినిమాలో విలన్‌గా నటించాలని ఉందంటున్న సుధీర్‌బాబు!
హీరోలు కొన్ని సినిమాల్లో విలన్స్‌గా నటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. చిరంజీవి, మోహన్‌బాబు వంటి హీరోలు మొదట విలన్స్‌గా సక్సెస్ అయిన తర్వాతే హీరోలుగా రాణించారు. ఇక గోపీచంద్ వంటి హీరో మొదట హీరోగానే పరిచయమై తర్వాత విలన్‌గా మూడు సినిమాలు చేసిన తర్వాతే హీరోగా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడున్న యంగ్ హీరోల్లో సుధీర్‌బాబు తెలుగులో చాలా సినిమాల్లో హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆమధ్య వర్షం రీమేక్‌గా హిందీలో రూపొందిన బాఘీ చిత్రంలో సుధీర్‌బాబు విలన్‌గా నటించి బాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు. టైగర్‌ష్రాఫ్, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన ఈ సినిమా బాలీవుడ్లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్, సుధీర్‌బాబుల మధ్య వచ్చే యాక్షన్స్ సీన్స్‌కు ఉత్తరాది ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సీన్స్‌లో టైగర్ ష్రాఫ్ కంటే సుధీర్బాబుకే మంచి అప్లాజ్ వచ్చింది. అలాంటి సుధీర్‌బాబు ఇప్పుడు తెలుగులో కూడా ఓ సినిమాలో మహేష్‌బాబుకి విలన్‌గా నటించబోతున్నాడన్న వార్త వినిపిస్తోంది.
ఈ వార్త వైరల్ కావడానికి ముఖ్యకారణం ఓ సందర్భంలో మహేష్‌బాబు సినిమాలో విలన్‌గా నటించాలని ఉంది అని సుధీర్‌బాబు తన మనసులోని మాటను చెప్పడం. మహేష్, సుధీర్ కాంబినేషన్లో ఏదో ఒక సినిమా ప్లానింగ్‌లో ఉండే ఉంటుంది. లేకపోతే సుధీర్ నోటి వెంట ఆ మాట ఎందుకు వస్తుంది? అని మహేష్ అభిమానులు చెప్పుకుంటున్నారు. ఇదే నిజమైతే ఆ ప్రాజెక్ట్‌కి మామూలు క్రేజ్ ఉండదు. మహేష్‌బాబుకి స్వయానా చెల్లలు భర్త అయిన సుధీర్ ఒక నెగెటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడంటే అది సినీవర్గాల్లో ఇంట్రెస్టింగ్ పాయింటే అవుతుంది కదా. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.













