ఆ బయోపిక్ పైనే సుధీర్ ఆశలు
ఈ మధ్య బయోపిక్ అంటే ప్రతీ హీరో ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే లెజండరీ బ్యాడ్మింటన్ ప్లేయర్ మరియు కోచ్ అయిన ‘పుల్లెల గోపీచంద్ ‘ బయోపిక్ గురించి ఐదేళ్ల నుండి చర్చలు మొదలైనా ఇప్పటి వరకు ఊసే లేదు. దీనికి సంబంధించి ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఆల్ మోస్ట్ వంద కోట్లు పెట్టి నిర్మించడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంది.
ఇక గోపి క్యారెక్టర్ కోసం గోపీచంద్ స్నేహితుడు , బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన సుధీర్ బాబుని హీరోగా ఎన్నుకున్నారు. దీనికి దర్శకత్వం ప్రవీణ్ సత్తారు అనుకున్నారు. దీనికి సంబంధించి అప్పట్లో కొంతకాలం ప్రీ – ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరిగాయి. హీరో సుధీర్ బాబు అయితే సినిమా కోసం కొన్ని ప్రిపరేషన్స్ కూడా చేసారు. ఈ మూవీ గురించి ఇదే అప్డేట్ ఉంది అంతకుమించి మరో విషయమే లేదు. ఆ ప్రాజెక్ట్ అక్కడితో హోల్డ్ లో పడింది.
ఈ సినిమా అనుకున్న హీరో, దర్శకుడు ఇద్దరు వేరే వేరే సినిమాల్లో బిజీ అయిపోయారు. గత రెండున్నరేళ్లుగా దీని గురించి ప్రస్తావనే లేదు. ఇక ఈ సినిమా చిత్రీకరణ లేదని అందరూ అనుకుంటున్నారు. కానీ హీరో సుధీర్‌కి మాత్రం దీనిపైన ఆశ పోలేదు. ఇప్పటికే తాను మరో మూడు సినిమాల్లో నటిస్తున్నారు. ఆ తరువాత ప్రాజెక్ట్ గా ఈ బయోపిక్ ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
ఈ సినిమా ఆలస్యం అవ్వడానికి కారణం గోపీచంద్ బయోపిక్ రైట్స్ మరొక సంస్థ చేజిక్కించుకున్నది. బయోపిక్ కి సంబంధించి గోపీచంద్ ఆటగాడిగా ఒక భాగాన్ని, కోచ్ గా మరొక భాగాన్ని చేయాలని అప్పట్లో అనుకున్నారు. మరి సుధీర్ ఇన్ని ఆశలు పెట్టుకున్న సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో? ఎన్ని భాగాలుగా రిలీజ్ అవుతుందో చూడాలి.













