Sudha Kongara: అందుకే శివకార్తికేయన్ తో సినిమా చేస్తున్నా

అమరన్(Amaran) సినిమాతో శివ కార్తికేయన్(Siva Karthikeyan) చాలా మంచి సక్సెస్ ను అందుకున్నాడు. అమరన్ సినిమా రూ.100 కోట్లు కలెక్ట్ చేసి ఏకంగా శివ కార్తికేయన్ కెరీర్లోనే చాలా పెద్ద హిట్ గా నిలిచింది. ఆ హిట్ వల్ల శివ కార్తికేయన్ కు వరుస ఛాన్సులొచ్చాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న శివ కార్తికేయన్ బిజి బిజీగా ఉన్నాడు.
అందులో భాగంగానే సుధా కొంగర(Sudha Kongara) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు శివ కార్తికేయన్. సుధా కొంగర గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పన్లేదు. సూరరై పొట్రు(Soorarai Potru) తో ఎన్నో ప్రశంలందుకున్న సుధా కొంగర ఇప్పుడు శివ కార్తికేయన్ తో పరాశక్తి(Parasakthi) అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాలో జయం రవి(Jayam Ravi), అథర్వ మురళి(Atharva Murali) కీలక పాత్రల్లో నటించనున్నారు.
జీవీ ప్రకాష్(GV Prakash) మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో నుంచి మొన్నా మధ్య టీజర్ ను రిలీజ్ చేయగా దానికి ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను డాన్ పిక్చర్స్ బ్యానర్(Don Pictures Banner) నిర్మిస్తుండగా ఈ సినిమాలో శివ కార్తికేయన్ ను తీసుకోవడానికి గల కారణాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ తెలిపారు. తాను రాసుకున్న క్యారెక్టర్ కు శివ అయితేనే కరెక్ట్ గా సరిపోతాడనిపించిందని, శివ పక్కింటి అబ్బాయి లుక్ లో కనిపిస్తాడని, అతని నిజాయితీ, హానెస్టీ సినిమాలోని తన పాత్రకు సరిగ్గా సరిపోతాయనిపించే అతన్ని ఎంపిక చేసినట్టు డైరెక్టర్ తెలిపింది.