కన్నడ హీరో ముందు పెద్ద పోటీ
కన్నడ ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపున్న యంగ్ హీరో ధృవ సర్జ(Dhruva Sarja). యాక్షన్ కింగ్ అర్జున్(Arjun) కు ధృవ స్వయానా మేనల్లుడు. అప్పట్లో పొగరు(Pogaru) అనే డబ్బింగ్ మూవీలో రష్మిక వెంట పడుతూ అల్లరి చేసే కుర్రాడున్నాడు కదా అతనే ధృవ. అతను నటించిన తాజా సినిమా మార్టిన్(Martin) పాన్ ఇండియా లెవెల్ లో అక్టోబర్ 11న రిలీజ్ కానుంది.
అయితే ధృవకు ఈ సినిమా విషయంలో మార్కెట్ లో చాలా పెద్ద పోటీనే ఉంది. మార్టిన్ ను ఒక రోజు ముందు అంటే అక్టోబర్ 10న రజినీకాంత్(rajinikanth) వేట్టయాన్(Vettayan) భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ సినిమాకు కర్ణాటక(Karnataka)లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఇక బయట మార్కెట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేట్టయాన్ తో పాటూ మరో నాలుగు సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ కానున్నాయి.
గోపీచంద్(Gopichand) విశ్వం(Viswam) దసరా బరిలోనే ఉంది. ఈ సినిమాకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) సపోర్ట్ ఫుల్ గా ఉంది. సుధీర్ బాబు(Sudheer Babu) మా నాన్న సూపర్ హీరో(Maa Nanna Super Hero)ని యువి క్రియేషన్స్(UV Creations) దగ్గరుండి మరీ పుష్ చేస్తోంది. అలియా భట్(Alia Bhatt) జిగ్రాని సురేష్ ఏషియన్(Suresh Asian) సంస్థలు డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల భారీ స్క్రీన్స్ దక్కే ఛాన్సుంది. ఇవి కాకుండా దిల్ రాజు(Dil Raju) నుంచి సుహాస్(Suhaas) హీరోగా తెరకెక్కిన జనక అయితే గనక(Janaka Ayithe Ganaka) కూడా రిలీజ్ కానుంది. వీటన్నింటి మధ్య మార్టిన్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.













