పురాణాల నేపథ్యంలో కుబేర మూవీ
ధనుష్- నాగార్జున కలిసి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకు కుబేర అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. శివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి ధనుష్ ఫస్ట్ లుక్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో ధనుష్ మాసిన గెడ్డం, పాత బట్టలతో ఉండగా, తన వెనుక శివ పార్వతుల ఫోటో ఒకటి ఉంది.
అయితే ఈ బ్యాక్ డ్రాప్ ను డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఆషామాషీగా పెట్టలేదట. కుబేరుడంటే కోటీశ్వరుడని అందరికీ తెలుసు. ఏడుకొండల వాడికే అప్పులిచ్చిన ఆయన ధనవంతుడే కానీ చూడ్డానికి మాత్రం అందగాడు కాదు. శేఖర్ కమ్ముల ఈ క్యారెక్టర్ డిజైన్ కోసం కుబేరుడి పూర్వ జన్మ అయిన గుణనిధి ని రిఫరెన్స్ గా తీసుకున్నాడట.
పురాణాల్లో సూత మహర్షి చెప్పిన ప్రకారం బ్రాహ్మణ వంశానికి చెందిన గుణనిధి వ్యసనాలకు, దొంగతనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని చూస్తుంటాడు. తండ్రికి నిజం తెలిశాక గుణనిధి కట్టుబట్టలతో పారిపోయి ఓ శివాలయంలో తల దాచుకుంటాడు. తర్వాత అక్కడ జాగారం చేసిన భక్తులకు పుణ్యం దక్కే పని చేశాక అక్కడ కాలుజారి నంది తల తగిలి చనిపోతాడు. ఆ ఫలితమే తర్వాతి జన్మలో కృతయుగంలో కుబేరుడి పుట్టుక. కుబేరుడి తపస్సుకు మెచ్చే శివుడు అద్భుత వరాలిస్తాడు. ఈ రెండు నేపథ్యాలను తీసుకుని శేఖర్ కమ్ముల, ధనుష్ క్యారెక్టర్ కు అన్వయించి ముంబై బ్యాక్ డ్రాప్ తో 90వ దశకంలో ఓ బిచ్చగాడు ఎలా మాఫియా స్థాయికి ఎదిగాడనే పాయింట్ తో కథను రెడీ చేశాడట. ఇదంతా చూస్తుంటే శేఖర్ కమ్ముల ధనుష్ తో చేసిన ప్లాన్ కు మైండ్ బ్లాక్ అవడం ఖాయం.













