War2: వార్2 కోసం స్టార్ హీరోల వాయిస్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కలయికలో అయాన్ ముఖర్జీ(Ayaan Mukharjee) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా వార్2(War2). ఈ ఇయర్ రానున్న భారీ సినిమాల్లో ఇది కూడా ఒకటి. యష్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు నెక్ట్స్ లెవెల్ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వినిపిస్తోంది.
వార్2లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పాత్రలను పరిచయం చేయడానికి స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారట. దీని కోసం తెలుగులో మహేష్ బాబు(Mahesh Babu), హిందీలో రణ్బీర్ కపూర్(Ranbir Kapoor) రంగంలోకి దిగుతున్నారట. సినిమాలో హీరోల పాత్రల గురించి కొన్ని చోట్ల వాయిస్ ఓవర్ వస్తుందని, ఆ వాయిస్ ఓవర్ ఎంతో కీలకమని తెలుస్తోంది. ఇప్పటికే వార్2పై భారీ అంచనాలుండగా ఈ వార్తలు విన్నాక ఆ అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో హృతిక్ పాత్రకు పోటీగా తారక్ క్యారెక్టర్ ఉంటుందని తెలుస్తోంది. వార్2లో ఎన్టీఆర్ పాత్ర నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుందని ఆ మధ్య వార్తలొచ్చాయి. అదే నిజమైతే వార్2లో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూడొచ్చు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వార్2 ప్రేక్షకుల ముందుకు రానుంది.













