నెట్ ఫ్లిక్స్ నుండి SSMB28 కి భారీ ఆఫర్..!?
సూపర్ స్టార్ మహేష్ బాబు కి మాములు ఫాలోయింగ్ ఉండదు అని తెలిసిన విషయమే. అదే సంగతి ఇప్పుడు మరోసారి ప్రూవ్ అయింది. మహేష్ బాబు నెక్స్ట్ మూవీ కి ఓటీటీ నుండి భారీ అఓఫిర్ లభించింది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వివరాల్లోకి వెళ్తే, సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకుంటుంది. ఎస్. రాధాకృష్ణ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
థమన్ ఈ సినిమాకి సంగీతం అందించగా, మహేష్ సరసన పూజ హేగ్దే హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రానికి టైటిల్ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇప్పటికే కొన్ని యాక్షన్ సీన్స్ ని రెగ్యులర్ షూటింగ్ ద్వారా చిత్రీకరించడం జరిగింది. తదుపరి షూటింగ్ మహేష్, పూజ హేగ్దే మధ్య జరిగే రొమాంటింటిక్ సన్నివేశాలపై జరుగనుందని సమాచారం. హీరోయిన్స్ శ్రీలీల, సంయుక్త మీనన్ కూడా ఈ సినిమాలో కీలకమైన పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తుంది.
రీసెంట్ గా మహేష్ అప్ కమింగ్ మూవీపై ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. త్వరలోనే షూటింగ్ ని కంప్లీట్ చేసుకోబోయే SSMB 28 కి ఓటీటీ దిగ్గజం అయినటువంటి నెట్ ఫ్లిక్స్ బంపర్ ఆఫర్ ని ఇచ్చింది. ఈ సినిమా హక్కులని పొందడానికి నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తాన్ని మేకర్స్ కి ఆఫర్ చేసిందట. మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వకముందే ఈ ఆఫర్ ని ఇవ్వడం విశేషం. దీన్ని బట్టి మహేష్ కి ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆల్రెడీ దర్శకుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపాయి. ఇక ఈ సారి కూడా అదే రేంజ్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది ఈ క్రేజీ కాంబో.













