Srinu Vaitla: నితిన్ అవుట్.. శర్వా ఇన్

దూకుడు(Dookudu) సినిమా వరకు టాలీవుడ్ లో శ్రీను వైట్ల(Srinu Vaitla) రేంజ్ వేరు. కానీ ఆగడు(Agadu) సినిమా తర్వాత నుంచి శ్రీను వైట్ల కెరీర్ డౌన్ ఫాల్ అవుతూ వచ్చింది. ఒకదాన్ని మించి మరో ఫ్లాపు రావడంతో శ్రీను వైట్ల కెరీర్ బాగా డల్ అయిపోయింది. ఎప్పటికప్పుడు ఈ సినిమా వర్కవుట్ అవుతుందనుకోవడం, రిలీజయ్యాక ఆ సినిమాతో నిరాశ ఎదుర్కోవడమే సరిపోతుంది.
అయితే ఆఖరిగా విశ్వం(Viswam) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శ్రీను వైట్ల, నితిన్(Nithin) తో సినిమా చేస్తాడని ఈ మధ్య వార్తలొచ్చాయి. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) ఈ సినిమాను నిర్మించనుందని కూడా అన్నారు. కానీ నితిన్ ఇప్పుడా ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది. నితిన్ తప్పుకోవడంతో ఆ ప్రాజెక్టు మరో టాలెంటెడ్ హీరో వద్దకు వెళ్లిందట.
ఆ హీరో ఎవరో కాదు, శర్వానంద్(sharwanand). ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న శర్వానంద్ ను రీసెంట్ గా శర్వానంద్ కలిసి కథ చెప్పగా, ఆ కథ శర్వాకు నచ్చిందని, శర్వా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని అంటున్నారు. ఈ సినిమాను కూడా మైత్రీ సంస్థనే నిర్మించనుందని, అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వీలుందని అంటున్నారు.