Srinu Vaitla: మైత్రీతో వైట్ల సినిమా?

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన శ్రీను వైట్ల(Srinu Vaitla) గత కొంత కాలంగా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయలేకపోతున్నాడు. గత కొన్ని సినిమాలుగా శ్రీను వైట్లకు సక్సెస్ మాత్రం దక్కడం లేదు. ఎప్పటికప్పుడు మంచి హిట్ అందుకుని సాలిడ్ కం బ్యాక్ ఇవ్వాలని చూస్తుంటే అది మాత్రం జరగడం లేదు. ప్రతీ సారీ సినిమా చేయడం, అది ఫ్లాపవడం, నెక్ట్స్ సినిమాపై ఆశలు పెట్టుకోవడం ఇదే జరుగుతూ వస్తుంది.
శ్రీను వైట్ల డైరెక్టర్ గా తన నుంచి ఆఖరిగా వచ్చిన సినిమా విశ్వం. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఆశించినంత హిట్ అవకపోయినా ఫుల్ రన్ లో సినిమా నిర్మాతలకు మంచి రాబడినే అందించింది. దీంతో విశ్వం(Viswam) తర్వాత శ్రీను వైట్ల ఎవరితో సినిమా చేస్తాడా అని అంతా అనుకుంటున్న టైమ్ లో టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ వార్త వినిపిస్తోంది.
టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్ లో శ్రీను వైట్ల సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఎంటర్టైనింగ్ సినిమాలతో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శ్రీను వైట్ల ఇప్పుడు మైత్రీలో ఛాన్స్ కొట్టేయడం హాట్ టాపక్ గా మారింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు కూడా బయటికొచ్చే ఛాన్సుంది. ఇదిలా ఉంటే గతంలో మైత్రీ బ్యానర్ లో శ్రీను వైట్ల చేసిన అమర్ అక్బర్ ఆంటోనీ(Amar Akbar Anthony) డిజాస్టర్ అవగా ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని తెలియడంతో ఈ సారైనా వైట్ల, మైత్రీతో కలిసి సక్సెస్ ను అందుకుంటాడా అని అనుకుంటున్నారు.