ఏజెంట్‌తో శ్రీకాంత్ మూవీ?
దసరా సినిమాతో ఈ మధ్యనే టాలీవుడ్‌కి పరిచయమైన శ్రీకాంత్ ఓదెల, మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను తెలంగాణ సింగరేణి గనుల నేపథ్యంలో వీరపల్లి అనే గ్రామంలో జరిగే ఓ కథగా శ్రీకాంత్ ఈ మూవీని రూపొందించారు.
ఈ మూవీ మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పాన్ ఇండియన్ లెవల్లో రిలీజైన ఈ సినిమాకు కలెక్షన్ల విషయంలో కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి. తెలుగులో తప్ప మిగిలిన భాషల్లో అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాలేదు. ఇదిలా ఉంటే దసరాతో శ్రీకాంత్ పనితనాన్ని చూసిన ప్రతీ ఒక్కరూ తనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శ్రీకాంత్ తర్వాతి సినిమా ఎవరితో చేయబోతున్నాడని అందరిలోనూ ఆసక్తి పెరుగుతుంది.
ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, శ్రీకాంత్ తన తర్వాతి సినిమాను అక్కినేని అఖిల్ తో చేసే ఛాన్సుందంటున్నారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డితో ఏజెంట్ సినిమా చేస్తున్న అఖిల్, ఆ తర్వాత మరో సినిమాను ఒప్పుకుంది లేదు. ఏజెంట్ ఈ నెల 28న రిలీజ్ అయ్యాక, ఆ తర్వాత శ్రీకాంత్ మూవీ కోసం అఖిల్ రెడీ కాబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం తన మొదటి సినిమా దసరా ఇచ్చిన సక్సెస్ కిక్‌ను ఎంజాయ్ చేస్తున్న శ్రీకాంత్, దాంతో పాటూ, అఖిల్ కోసం స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడట. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.













