Chiranjeevi: ఓదెల మెగా మూవీ కన్ఫర్మ్ అయిందా?
భోళా శంకర్(Bhola Shankar) సినిమా ఫలితంతో గుణపాఠం నేర్చుకున్న చిరంజీవి(Chiranjeevi) కథలను ఎంపిక చేసే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఆచితూచి అడుగులేస్తూ కథలు వింటున్న చిరూకి ఇప్పటికే పలువురు డైరెక్టర్లు కలిసి కథలు వినిపించారు. కానీ స్క్రిప్ట్ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల చిరూ ఏ సినిమాకూ కమిట్ అవలేదు.
అయితే ఇప్పుడు చిరంజీవి ఈ జనరేషన్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దసరా(Dasara) సినిమాతో టాలీవుడ్లోకి డైరెక్టర్ గా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) రీసెంట్ గా చిరూ(Chiru)కి ఓ లైన్ చెప్పగా, ఆ లైన్ బాగా నచ్చి చిరూ డెవలప్ చేయమని చెప్పాడట. ఈ సినిమాను వైజయంతీ మూవీస్(Vyjayanthi Movies) బ్యానర్ పై అశ్వినీదత్(Aswinidutt) నిర్మిస్తాడని టాక్.
శ్రీకాంత్ చిరూకి కరుడుగట్టిన అభిమాని. దసరా సినిమాలో పలుచోట్ల చిరూ రిఫరెన్స్ కూడా వాడాడు. అలాంటి శ్రీకాంత్ తన అభిమాన హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఏ స్థాయిలో ఎలివేట్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం నాని(Nani)తో చేస్తున్న ది ప్యారడైజ్(The Paradise) సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్న శ్రీకాంత్ ఈ సినిమా అయిపోగానే చిరూ సినిమా చేస్తాడని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఎంతలేదన్నా చిరూ ప్రాజెక్ట్ మొదలవడానికి మరో ఏడెనిమిది నెలలకు పైగా టైమ్ పట్టనుంది.













