ఒరేయ్ స్నేక్ బాబు! చూసావా? కర్మ అనేది చూశావా! ఇప్పుడేమైంది? : నాగబాబు పై శ్రీ రెడ్డి బండబూతులు
పబ్ రైడ్‌లో దొరికిన మెగా డాటర్ నిహారికది తప్పుకాదని.. ఆమెను అలా పెంచిన నాగబాబుదే తప్పు అంటూ ఓ రేంజ్లో ఫైర్ అయ్యింది శ్రీరెడ్డి. విధి ఎవర్నీ వదిలిపెట్టదని.. ఆడ కూతుర్ని ఏడిపించినందుకు అనుభవిస్తున్నారంటూ నాగబాబుని పవన్ కళ్యాణ్‌ని పచ్చి బూతులు తిట్టేసింది శ్రీరెడ్డి. మెగా ఫ్యామిలీపై మరోసారి విరుచుకుపడింది శ్రీరెడ్డి. పబ్ దాడుల్లో మెగా డాటర్ నిహారిక పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడంతో ఆ ఇష్యూపై స్పందిస్తూ బూతులతో రెచ్చిపోయింది శ్రీరెడ్డి. కర్మ ఎవర్నీ వదిలిపెట్టడదని.. తనని ఏడిపించిన నాగబాబు, పవన్ కళ్యాణ్ అంతకి మించే అనుభవిస్తారంటూ నోటికి పని చెప్పింది శ్రీరెడ్డి.
ఫేస్ బుక్ లైవ్‌లోకి వచ్చిన శ్రీరెడ్డి.. అరగంట పాటు ఈ ఇష్యూపైనే మాట్లాడుతూ చెలరేగింది.శ్రీరెడ్డి మాట్లాడుతూ.. “నాగబాబూ.. కర్మ అనేది చూశావారా? నువ్ నన్ను ఎంత టార్గెట్ చేశావ్ రా.. మీటింగ్‌ల మీద మీటింగ్‌లు పెట్టావ్.. యూట్యూబ్ ఛానల్స్‌లో ఎంత తిట్టావ్.. ఎంత టార్గెట్ చేశావ్.. ఒక ఆడపిల్లని అని చూడకుండా నాతో ఎంత ఆడుకున్నావో.. నిన్ను శ్రీరెడ్డి ఏమీ చేయలేకపోయింది. కానీ కర్మ అనేది నిన్ను వదిలిపెట్టలేదు.. వెంటాడింది. ప్రకృతి నీకు తిరిగి ఇచ్చేస్తుంది. అరేయ్ స్నేక్ బాబూ.. నేను శక్తిని కాకపోవచ్చు కానీ.. నేను పూజించేది శక్తినే. నన్ను బ్యాడ్‌గా చిత్రీకరించావ్.. బ్లేడ్ బాబ్జీ అని నన్ను ఎంత టార్గెట్ చేశార్రా.. ఈరోజు ఏమైంది? నాకు మా అమ్మ నాన్న సపోర్ట్ లేదని తెలుసు.. ఒక ఆడపిల్లని టార్గెట్ చేయడం వీరత్వమా? మీ అమ్మాయి వీర మహిళ అని చెప్పి.. మా బాబాయ్‌కి ఓటు వేయండి అని అన్నది.. అంటే వీర మహిళలు చేసే తతంగాలు ఇలా ఉంటాయా? పబ్‌లకు వెళ్లడం తప్పని నేను అనడం లేదు.. కానీ మూడు గంటల రాత్రి పూట వెళ్తారా? అది కూడా ఉగాది రోజు పక్కన భర్త లేకుండా వెళ్తుందా.. మా వైసీపీ వాళ్లని కించపరుస్తూ మాట్లాడావ్ కదా.. మరి ఇప్పుడు ఏమంటావ్.. మీ వీర మహిళల సంగతి ఏంటి? మా ఇంట్లో ఆడపిల్లలు అలాంటి వాళ్లు ఇలాంటి వాళ్లు పైనుంచి దిగొచ్చారని చెప్పే కళ్యాణాల పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం మాట్లాడతాడు. మీ అన్నయ్య బిగ్ బాస్ స్టేజ్‌పై ఓ ట్రాన్స్ జెండర్‌తో నన్ను ఎలా తట్టించాడో చూశాం. అసలు మీ పెంపకాలు ఏంట్రా? నాగబాబూ ఆ పిల్లది కాదు తప్పు.. పెంపకానిది తప్పు. మా పెంపకాలు గొప్పవని మేం అనడం లేదు.. అందుకే మా బతుకు ఇలా తగలడింది.
తల్లిదండ్రుల మాట వినకపోతే ఏమౌతారో మాకు తెలిసి వచ్చింది. కానీ నువ్ నీతులు చెప్తావ్ కదా.. మరి నీ కూతుర్ని ఏంటి ఇలా పెంచావ్.. మా గురించి కామెంట్లు చేస్తావ్ కదా.. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? సీతాదేవితో పోల్చుతూ వీడియోలు పెట్టావ్.. కూతురు పెళ్లి అప్పుడు.. సీతాదేవి అర్ధరాత్రి పబ్‌కి వెళ్తుందా? పక్కన మొగుడు లేకుండా పోతుందా? ఇప్పుడు చెప్పండి మీ ఫీలింగ్ ఎలా ఉందో.. ఇంట్లో అమ్మాయిలకు ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ల పేరెంట్స్ ఎంత బాధపడతారో తెలిసిందా? ఈరోజు మీకు తెలిసి వచ్చిందా? ఇది శాంపిల్ మాత్రమే నాగబాబూ.. ఇంకా ఇంకా అనుభవిస్తావు.. నన్ను ఎంతలా తిట్టించావు.. నన్ను రాత్రి పూట నిద్ర లేకుండా చేసి మరీ తిట్టారు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. చివరికి దేవుడి కోర్టులో ఎవరూ తప్పించుకోలేదు. కర్మ అనేది దూల తీర్చేస్తుంది. అవకాశాలు లేకుండా చేశారు.. చివరికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డు రాకుండా చేశారు. ఇండస్ట్రీలో పెద్దలుగా ఉన్న వాళ్లు ఏం చేయాలి.. నీ వరకూ వచ్చేసరికి నా కూతురు తప్పులేదని అంటున్నావ్.. మరి మిగిలిన ఆడపిల్లలు అలాంటి వాళ్లు కాదా? అయినా ఉగాది రోజు పబ్‌కి వెళ్లడం ఏంటి?? ఆమె వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావ్ నాగబాబూ.. పద్దతులు మాకు నేర్పుతావ్ కదా.. మరి నీ కూతురుకి పద్దతి నేర్పలేదా? మీరు ఎంతమందిని ఎన్ని విధాలుగా ట్రోల్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను ఎంతమంది ఎన్ని విధాలుగా టార్చర్ చేశారో మీకు ఇప్పటికైనా తెలిసిందా? లారీలు ఆపి నేను ఏదో చేయించుకుంటా అని ఏడిపించారు.. అసలు నా ఆస్తి మీకు తెలుసా? నేను లారీలు ఆపేదాన్నని అన్నారు. మరి నాగబాబు కూతురుకి ఏమైంది? పబ్‌కి ఎందుకు వెళ్లింది? నా పని నేను చేసుకుంటున్నా.. అయినా నన్ను వదల్లేదు. ఇప్పటికైనా మంచి చెడు ఆలోచించండి.. ఏ అమ్మాయినైనా టార్గెట్ చేసేటప్పుడు.. తిట్టేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకోండి”.. అంటూ లైవ్‌లో పచ్చిబూతులు తిట్టేసింది శ్రీరెడ్డి.
https://www.facebook.com/













