Sri Gouri Priya: తెలుగమ్మాయికి మరో బంపరాఫర్

మూవీ ఇండస్ట్రీలో ఇప్పుడో కొత్త సెంటిమెంట్ వినిపిస్తోంది. తెలుగు హీరోయిన్లు కోలీవుడ్ లో నటించి అక్కడ గుర్తింపు వస్తే కానీ ఇక్కడ తెలుగులో సరైన గుర్తింపు దక్కడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంజలి(Anjali), శ్రీదివ్య(Sridivya), ఆనంది(anandhi), ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) అంతా అలా వచ్చి సక్సెస్ అయినవాళ్లే కాగా ఇప్పుడీ లిస్ట్ లోకి మరో తెలుగమ్మాయి చేరింది. తనే శ్రీగౌరీ ప్రియ(Sri gouri Priya).
మ్యాడ్(Mad) సినిమా కంటే ముందు శ్రీగౌరీ అరడజనుకి పైగా సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాలు చేసిన సంగతి ఆమెకు తప్ప మరెవరికీ తెలియదు. కానీ ఎప్పుడైతే ట్రూ లవర్(True Lover) చేసి ఆ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకుందో అప్పుడే శ్రీగౌరీకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. నిజానికి శ్రీ గౌరీకి మ్యాడ్ సినిమాతో మంచి గుర్తింపు వచ్చినప్పటికీ ఆమె అందులో సెకండ్ హీరోయిన్.
మోడ్రన్ లవ్ చెన్నై(Modern love chennai) అనే తమిళ సినిమాతో యాక్టింగ్ కెరీర్ ను స్టార్ట్ చేసిన శ్రీ గౌరీ ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. ఇప్పుడు ట్రూ లవర్ తర్వాత శ్రీగౌరీకి ఆఫర్లు వస్తుండగా, ఆల్రెడీ కిరణ్ అబ్బవరం(kiran abbavaram)తో కలిసి చెన్నై లవ్ స్టోరీ(Chennai Love story) చేస్తుంది. గల్లా అశోక్(Galla Ashok) హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) బ్యానర్ లో తెరకెక్కుతున్న వింటావా సరదాగా(Vintaava Saradaga)లో శ్రీగౌరీ ప్రియ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో శ్రీగౌరీ లిప్ లాక్స్, ఇంటిమసీ సీన్స్ కూడా చేయనుందట.