Sreenidhi Shetty: బంపరాఫర్ కొట్టేసిన శ్రీనిధి శెట్టి
హిట్ వచ్చాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్లు క్యూ కడతాయి. కానీ కెజిఎఫ్(KGF) రెండు భాగాల్లో యష్(Yash) కు జోడీగా చేసిన శ్రీనిధి శెట్టి(Sreenidhi Shetty) కొంతకాలం ఖాళీగా ఉండాల్సి వచ్చింది. విక్రమ్(Vikram) కోబ్రా(Cobra)లో మెరిసినా దాని ఎఫెక్ట్ నిరాశ కలిగించడంతో ఎలాంటి లాభం దక్కలేదు. 2018 నుంచి 2022 వరకు కేవలం మూడు సినిమాలే నటించింది.
ఇప్పుడు అమ్మడి రేంజ్ క్రమంగా మారుతుంది. ముందు సిద్దూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) తెలుసు కదా(Thelusu Kadha) సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీనిధి, నేచురల్ స్టార్ నాని(Nani) హిట్3(Hit3) లో కూడా శ్రీనిధినే మెయిన్ లీడ్. శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే అమ్మడికి ఇప్పుడు సూపర్ ఛాన్స్ దక్కినట్టు సమాచారం.
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) జైలర్2(Jailer2) లో శ్రీనిధికి ఛాన్స్ వచ్చినట్టు కోలీవుడ్ వర్గాల టాక్. నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dileep Kumar) దర్శకత్వం వహించబోయే ఈ సినిమాకు ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తైంది. జైలర్2 సినిమాపై మామూలు హైప్ లేదు. ఈ సినిమా ఓకే అయితే శ్రీనిధి జాక్ పాట్ కొట్టినట్టే. ఎందుకంటే జైలర్2లో మరో స్టార్ హీరో కూడా ఉన్నాడు. అతడికి జోడీగా శ్రీనిధి కనిపించనుందని తెలుస్తోంది.













