Ustaad Bhagath Singh: ఉస్తాద్ కు ముస్తాబవుతున్న లీలమ్మ

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తను ఒప్పుకున్న సినిమాలన్నింటినీ మెల్లిగా పూర్తి చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగానే హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu) ఫినిష్ చేసి దాన్ని రిలీజ్ కు రెడీ చేశాడు. ఆల్రెడీ ఓజి(OG) కు డేట్స్ ఇచ్చి కుదిరినప్పుడల్లా ఆ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. త్వరలోనే ఉస్తాద్ భగత్‌సింగ్(Ustaad Bhagath Singh) మూవీకి కూడా పవన్ తన కాల్షీట్స్ ను ఇవ్వనున్నాడు. దీంతో డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) ఉస్తాద్ భగత్‌సింగ్ కొత్త షెడ్యూల్ కు రెడీ అవుతున్నాడు.
చిత్ర యూనిట్ తో పాటూ హీరోయిన్ శ్రీలీల(Sree Leela) కూడా ఆ చిత్ర షూటింగ్ కు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల రాబిన్‌హుడ్(Robinhood) తో ఫ్లాప్ అందుకున్న శ్రీలీల ఈ మూవీపై చాలా హోప్స్ పెట్టుకుంది. ఈ సినిమా షూటింగ్ లో పవన్ జూన్ నుంచి జాయిన్ అయ్యే అవకాశముంది. ఇందులో పవన్, శ్రీలీల మధ్య తెరకెక్కించాల్సిన కొన్ని సన్నివేశాలు ఇంకా పెండింగ్ ఉండటంతో మేకర్స్ శ్రీలీలను బల్క్ లో డేట్స్ అడిగారట.
శ్రీలీల కూడా డేట్స్ విషయంలో మేకర్స్ కు అనుకూలంగానే రెస్పాండ్ అయి వారు అడిగిన డేట్స్ ను అడ్జస్ట్ చేసినట్టు తెలుస్తోంది. గత కొన్ని సినిమాలుగా సరైన సబ్జెక్టులను ఎంచుకోలేక ఫ్లాపులందుకుంటున్న శ్రీలీల ఈ సినిమాతో హిట్ అందుకుని తన స్టార్‌డమ్ ను మరింత పెంచుకోవాలని చూస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నాడు.