రిపీట్ కానున్న ధమాకా కాంబో?
ధమాకా సినిమాతో గతేడాది మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఈ సినిమాకు ముందు టాక్ యావరేజ్ గా వచ్చినా ఆఖరికి మంచి వసూళ్లతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్ లో శ్రీలీల గ్లామర్, డ్యాన్సులు కీలక పాత్ర పోషించిన విషయం అందరిక తెలిసిందే. సినిమా రిలీజ్ కు ముందు రవితేజ లాంటి సీనియర్ పక్కన శ్రీలీల కంటికి ఆనుతుందా అనుకున్నారు. కానీ ఆన్ స్క్రీన్ పై ఎక్కడా ఆ తేడా రాకుండా రవితేజ-శ్రీలీల మేనేజ్ చేశారు.
ఆ తర్వాత వీరిద్దరూ విడి విడిగా చేసిన ఏ సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ అవలేదు. ఇదిలా ఉంటే వీరిద్దరూ కలిసి ఇప్పుడు మరోసారి జోడీ కట్టబోతున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో భాను భోగవరపు దర్శకత్వంలో నిర్మించబోయే వినోదాత్మక సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం. 2025 సంక్రాంతికి రిలీజ్ అని ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ టైమ్ లోనే చెప్పేశారు.
దీంతో కుదిరినంత త్వరగా సినిమా షూటింగ్ ను మొదలుపెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. జూన్ నుంచి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఛాన్సులున్నాయి. ప్రస్తుతం ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ కోసమని సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న శ్రీలీల ఏ సినిమాకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా మంచి కథల కోసం ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలోనే రవితేజ సినిమా కథ వెళ్లడం, అమ్మడికి స్టోరీ బాగా నచ్చడం, ఓకే చేయడం జరిగిపోయాయని టాక్.













