Dragon: డ్రాగన్ లో సాహో హీరోయిన్
దేవర(Devara) తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) హీరోగా వస్తున్న సినిమా డ్రాగన్(Dragon). ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎన్టీఆర్నీల్(NTRNeel) అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతుంది. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాకు మేకర్స్ డ్రాగన్ అనే పేరుని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది.
డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్(Sraddha Kapoor) ఓ కీలక పాత్రలో నటిస్తుందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా సెకండాఫ్ లో వచ్చే శ్రద్ధా పాత్ర సినిమా మొత్తానికే హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. అయితే ఇందులో ఎంతమాత్రం నిజముందనేది మాత్రం తెలియాల్సి ఉంది. దానికి కారణం లేకపోలేదు.
ఇప్పటికే డ్రాగన్ సినిమా కోసం ఎన్టీఆర్ సరసన కన్నడ భామ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) ను ఫిక్స్ చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఉన్నట్టుండి శ్రద్ధా కపూర్ పేరు వినిపించడం అందరినీ అయోమయానికి గురి చేస్తుంది. డ్రాగన్ మూవీ హీరోయిన్ విషయంలో మేకర్స్ ఏదొకటి క్లారిటీ ఇచ్చే వరకు ఇలాంటి వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.






