మరో క్రికెటర్ బయోపిక్ కి రెడీ అవుతున్న బాలీవుడ్…
ఇప్పటికే పలువురి క్రికెటర్స్ బియోపిక్స్ తో బాలీవుడ్ ప్రేక్షకులని అలరించింది. ధోని, కపిల్ బియోపిక్స్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది. కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమాలు బాగానే వసూలు చేశాయని చెప్పాలి. అందుకే మరిన్ని బియోపిక్స్ ని తెరపైకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సినిమాలకి సంబంధించిన స్క్రిప్ట్స్ ని రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ తరుణంలోనే ఈసారి మరో క్రికెటర్ బయోపిక్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి రాబోతుంది బిటౌన్. టీం ఇండియా మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కథని బయోపిక్ గా ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు. ఆయన జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఈ విషయం మీద ఇప్పటివరకు ఎలాంటి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అసలు గంగూలి బయోపిక్ ఉందా లేదా అని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ కి సంబంధించిన లవ్ ఫిల్మ్స్ బ్యానర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామని మేకర్స్ అన్నారు. స్క్రిప్ట్ చర్చల్లో పాల్గొనేందుకు కలకత్తా నుండి గంగూలీ ముంబయికి వచ్చినట్లుగా తెలుస్తుంది.
గంగూలీ జీవితానికి సంబంధించిన అన్ని ముఖ్య ఘట్టాలని ఈ బయోపిక్ లో పొందుపరుస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో, ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ఈ సినిమాని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్ని అనుకున్న టైం లో జరిగితే వచ్చే ఏడాదికి గంగూలీ బయోపిక్ ప్రేక్షకుల ముందుకి వస్తుంది.













