ట్రూ లవర్ SKNపై నమ్మకం
టాలీవుడ్ లో ఈ వారం రిలీజైన సినిమాల్లో యాత్ర2 పై సామాన్య ప్రేక్షకులు ఏమంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఏదో ఏపీ అధికార పార్టీ అభిమానులు సినిమా విషయంలో సంతృప్తిగా ఉన్నారు కానీ సినిమాకు కలెక్షన్లు కూడా ఏమంత గొప్ప స్థాయిలో లేవు. ఈగల్ సినిమాకు మిక్డ్స్ టాక్ వచ్చింది. ఇది చివరకు ఏ రిజల్ట్ ను ఇస్తుందనేది మరో రెండ్రోజులు ఆగితే కానీ తెలియదు.
ఇక లాల్ సలామ్ సినిమా మార్నింగ్ షోలకే ఎన్నో తిప్పలు పడింది. రజినీకాంత్ ఉన్నప్పటికీ సినిమా కనీస ఓపెనింగ్స్ ను తెచ్చుకోలేకపోయింది. దీంతో ఇప్పుడందరీ కళ్లు ట్రూ లవర్ సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ ఆడియన్స్ కు తెలిసిన ఫేసెస్ పెద్దగా లేవు. హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ మాత్రమే పరిచయం.
అయితే ట్రైలర్ మాత్రం యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. కంటెంట్ మీద నమ్మకంతో ఈ సినిమాను తమిళంలో ఒరిజినల్ వెర్షన్ చూసి మరీ నిర్మాత ఎస్కెఎన్ తెలుగు హక్కులను కొని రిలీజ్ కు రెడీ చేశాడు. తక్కువ బడ్జెట్ తో వస్తున్న సినిమా కావడంతో కంటెంట్ బాగుండి యూత్ కు కనెక్ట్ అయితే కాసుల వర్షం కురవడం ఖాయం. ఎస్కెఎన్ ఖాతాలో ఇది మరో బేబీ అవడం గ్యారెంటీ. ఆ నమ్మకంతోనే ఈ సినిమాను కొని ప్రమోషన్స్ కు పెద్దగా టైమ్ లేకపోయినా వెంటనే రిలీజ్ చేస్తున్నారు. రిలీజై మంచి టాక్ వస్తే మౌత్ టాక్ సినిమాకు మంచి ప్రమోషన్ గా మారుతుందని ఆయన నమ్మకం. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.













