రాజా సాబ్ ప్రమోషన్స్ మొదలయ్యేదెప్పుడంటే..
ఈ ఇయర్ కల్కి(Kalki) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నుంచి పెద్దగా గ్యాప్ లేకుండా తొమ్మిది నెలల్లోనే తర్వాతి సినిమా రానుంది. మారుతి(Maruthi) దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న రాజా సాబ్(Raja Saab) సినిమా వచ్చే వేసవికి రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. వాస్తవానికి రాజా సాబ్ ఈ ఇయర్ రిలీజ్ కావాల్సింది కానీ లేటయింది.
అయితే రాజా సాబ్ నుంచి ఇప్పటివరకు ఫస్ట్ లుక్, చిన్న గ్లింప్స్ తప్ప ఎలాంటి కంటెంట్ రిలీజ్ కాలేదు. ఈ సినిమా ప్రమోషన్స్ ఎప్పట్నుంచి మొదలవుతాయనే విషయాన్ని రీసెంట్ గా మారుతి(maruthi)కి అత్యంత సన్నిహితుడైన నిర్మాత SKN వెల్లడించాడు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లే ప్రభాస్ బర్త్ డే అయిన అక్టోబర్ 23న రాజా సాబ్ టీజర్(Raja Saab teaser) ఉంటుందని ఆయన వెల్లడించాడు.
అంతేకాదు ఆ తర్వాత నుంచి రాజా సాబ్ కు సంబంధించిన అప్డేట్స్ వరుసగా ఇవ్వాలని డైరెక్టర్ మారుతి, నిర్మాత విశ్వ ప్రసాద్(Viswa Prasad) ప్లాన్ చేస్తున్నట్లు SKN తెలిపాడు. సినిమాను అనుకున్న టైమ్ కు తీసుకుని రావాలని వినాయక చవితి, దసరాకి కూడా సెలవులు తీసుకోకుండా మారుతి రాజా సాబ్ కోసం కష్టపడుతున్నాడని SKN వెల్లడించాడు.













