Sivaji: అఖిల్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మంగపతి

చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ కెరీర్ ను మొదలుపెట్టిన శివాజీ(Sivaji) తర్వాత సెకండ్ హీరోగా, ఆ తర్వాత హీరోగా మారి ఆడియన్స్ లో మంచి గుర్తింఉ తెచ్చుకున్నారు. తర్వాత సినిమాలకు బ్రేక్ రావడంతో పాలిటిక్స్ లో తిరిగారు కానీ దాన్నుంచి కూడా తప్పుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్(Bigg Boss) లో కనిపించి ఆ రియాలిటీ షో ద్వారా చాలా క్రేజ్ సంపాదించుకున్నారు.
బిగ్ బాస్ నుంచి వచ్చాక శివాజీ నుంచి 90స్ మిడిల్ క్లాస్(90’s Middle Class) అనే వెబ్ సిరీస్ రాగా ఆ సిరీస్ కు ఆడియన్స్ నుంచి ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని(Nani) నిర్మించిన కోర్టు(Court) సినిమాలో విలన్ గా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు శివాజీ. కోర్టు లో మంగపతి(mangapathi) అనే పాత్రలో జీవించేసిన శివాజీ ఆ సినిమాలో తన నటనతో అందరి దృష్టిని తన వైపుకు మరల్చుకున్నారు.
కోర్టు సినిమా చూశాక శివాజీకి ఇకపై మరిన్ని అవకాశాలొస్తాయని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు శివాజీకి ఓ స్టార్ మూవీలో క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అఖిల్ అక్కినేని(Akhil Akkineni) హీరోగా మురళీ కిషోర్ అబ్బూరు(Murali Kishore Abburu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లెనిన్(Lenin) సినిమాలో శివాజీ విలన్ గా కనిపించనున్నారని అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వార్త నిజమైతే మాత్రం శివాజీకి మున్ముందు ఇంకా పెద్ద పెద్ద సినిమాల్లో కూడా అవకాశాలొచ్చే ఛాన్సుంది.